iDreamPost

చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రాంతానికి పేరు పెట్టిన ప్రధాని మోదీ

  • Published Aug 26, 2023 | 9:43 AMUpdated Aug 26, 2023 | 1:41 PM
  • Published Aug 26, 2023 | 9:43 AMUpdated Aug 26, 2023 | 1:41 PM
చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రాంతానికి పేరు పెట్టిన ప్రధాని మోదీ

ఇస్రో(ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) జరిపిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. జులై 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి ఇస్రో రాకెట్‌ను నింగిలోకి పంపగా.. వివిధ దశలను దాటుకుంటూ ఆగస్టు 23న విక్రమ్‌ ల్యాండర్‌ సక్సెస్‌ఫుల్‌గా చంద్రుడిపై కాలుమోపింది. ఈ ప్రయోగంతో జాబిల్లిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది. అలాగే చంద్రుడి దక్షిణ ద్రువంపై ల్యాండర్‌ను దింపిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. ఆగస్టు 23న సాయంత్రం 6.04 నిమిషాలకు మన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై దిగింది.

ఆ సయమంలో దేశ ప్రధాని నరేంద్రమోదీ సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచే లైవ్‌లో పాల్గొని ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన మోదీ.. తాజాగా సౌతాఫ్రికా పర్యటన ముగించుకుని ఇండియాకి తిరిగొచ్చిన ప్రధాని మోదీ.. బెంగుళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించించారు. ఈ కార్యక్రమంలోనే విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై కాలు మోపిన ప్రాంతానికి ‘శివ్‌శక్తి’ అని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ చంద్రయాన్‌-3 ప్రయోగంలో మహిళా శాస్త్రవేత్తలు కూడా ఎక్కువ సంఖ్యలో పాలుపంచుకున్నారని, దీంతో నారీ శక్తి పవరేంటో ప్రపంచానికి తెలిసొచ్చిందంటూ ప్రధాని పేర్కొన్నారు.

చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రాంతంతో పాటు.. 2019లో ప్రయోగించిన చంద్రయాన్‌-2 లూనార్‌ సర్ఫేజ్‌లో తన ముద్ర వదిలిన ప్రాంతానికి సైతం ప్రధాని మోదీ పేరు పెట్టారు. ఈ ప్రాంతానికి ‘తిరంగా పాయింట్‌’ అని నామకరణం చేశారు. కాగా, 23న చంద్రుడిపై ల్యాండ్‌ అయిన విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి ప్రగ్యాన్‌ రోవర్‌ బయటికి వచ్చి.. చంద్రుడిపై చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్యాన్‌ రోవర్‌.. ల్యాండర్‌ నుంచి బయటికి వచ్చి చంద్రుడిపై తిరుగుతున్న ఫొటోలను సైతం ఇస్రో విడుదల చేసింది. 23 నుంచి మొత్తం 14 రోజుల పాటు అక్కడి ఉండి రోవర్‌ చంద్రుడిపై వివిధ రకాల సమాచారం చేకరించనుంది. మరి విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రాంతానికి పేరు పెట్టడం, పెట్టిన పేరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చంద్రయాన్-3 జాబిల్లిపై దిగిన సమయంలో పుట్టిన పిల్లల పేర్లు ఏంటంటే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి