iDreamPost

75 ఏళ్లలో తొలిసారి ఆ గ్రామానికి మొబైల్ నెట్ వర్క్! ఫస్ట్ ఫోన్ కాల్ ప్రధాని మోదీకి!

ప్రస్తుత రోజుల్లో మొబైల్ నెట్ వర్క్ లేని గ్రామం ఉందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఓ గ్రామంలో ఇప్పటి వరకు మొబైల్ నెట్ వర్క్ లేదు. 75 ఏళ్ల తర్వాత ఆ గ్రామం మొబైల్ నెట్ వర్క్ పొందింది.

ప్రస్తుత రోజుల్లో మొబైల్ నెట్ వర్క్ లేని గ్రామం ఉందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఓ గ్రామంలో ఇప్పటి వరకు మొబైల్ నెట్ వర్క్ లేదు. 75 ఏళ్ల తర్వాత ఆ గ్రామం మొబైల్ నెట్ వర్క్ పొందింది.

75 ఏళ్లలో తొలిసారి ఆ గ్రామానికి  మొబైల్ నెట్ వర్క్! ఫస్ట్ ఫోన్ కాల్ ప్రధాని మోదీకి!

75 ఏళ్ల స్వతంత్య్ర భారత్ లో ఇంకా మౌళిక సదుపాయాలకు నోచుకోని గ్రామాలెన్నో ఉన్నాయి. ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ప్రజల కనీస అవసరాలు మాత్రం తీరడం లేదు. ఓ వైపు 5జీ నెట్ వర్క్ తో దేశం దూసుకెళ్తుంటే మరో వైపు అసలు మొబైల్ నెట్ వర్క్ లేని గ్రామాలు దర్శనమిస్తున్నాయి. ఓ రాష్ట్రంలో మొబైల్ నెట్ వర్క్ లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆ గ్రామంలో ఇప్పటి వరకు మొబైల్ నెట్ వర్క్ సౌకర్యం లేదు. అక్కడి స్థానికులు తమ మొబైల్ ఫోన్లను వాడుకునేందుకు ఏకంగా 8 కి.మీలు ప్రయాణిస్తున్నారు. ఇలాంటి గ్రామం ఇన్నేళ్ల తర్వాత మొదటి సారి మొబైల్ నెట్ వర్క్ ను పొందింది. ఈ గ్రామమే గియూ. ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో విద్యుత్, త్రాగునీరు, ఇంకా ఇతర వసతులను కల్పిస్తోంది. దీనిలో భాగంగానే హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితికి చెందిన గియూ విలేజ్ మొదటిసారిగా మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడింది. తొలిసారి మొబైల్ నెట్ వర్క్ అందుబాటులోకి రావడంతో అక్కడి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చిన అనంతరం అక్కడి స్థానికులతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ప్రధాని మోడీ 13 నిమిషాలకు పైగా ప్రజలతో ఫోన్‌లో మాట్లాడారు.

ఓ గ్రామస్థుడు ప్రధానమంత్రికి తమ గ్రామం మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడుతుందని తాను నమ్మలేకపోతున్నానని తెలిపాడు. ఇది వరకు ఫోన్ మాట్లాడాలంటే మొబైల్ పట్టుకుని 8 కిమీలు ప్రయాణించేవాళ్లమని చెప్పాడు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి ఇంటికి విద్యుత్ అందించి అన్ని ప్రాంతాలను కమ్యూనికేషన్ టెక్నాలజీతో అనుసంధానించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోడీ వెల్లడించారు. తాను ప్రధాని అయ్యే నాటికి 18 వేల గ్రామాల్లో విద్యుత్ కొరత ఉండేదని.. తాము అధికారం చేపట్టిన అనంతరం ఆ సమస్యను పరిష్కరించామని తెలిపారు. అదేవిధంగా వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేశామని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి