iDreamPost

చంద్రయాన్-3 జాబిల్లిపై దిగిన సమయంలో పుట్టిన పిల్లల పేర్లు ఏంటంటే..

చంద్రయాన్-3 జాబిల్లిపై దిగిన సమయంలో పుట్టిన పిల్లల పేర్లు ఏంటంటే..

భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైంది. జులై 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 రాకెట్‌.. వివిధ దశలను దాటుకుంటూ అంతిమంగా చంద్రుడిపై సేఫ్ గా ల్యాండ్ అయింది. దీంతో చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం అవ్వడంతో.. చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశంగా, చంద్రుడి దక్షిణ ద్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ అవతరించింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇదే సమయంలో చంద్రయాన్‌-3 విజయాన్ని కొందరు తల్లిదండ్రులు వినూత్నంగా సెలబ్రేట్‌ చేస్తున్నారు. ఇస్రో పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన సమయంలో పుట్టిన తమ పిల్లలకు చంద్రయాన్‌ సంబంధించిన పేర్లు పెట్టాలని నిర్ణయించారు.

భారత్‌ సాధించిన చంద్రయాన్‌-3 విజయాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజల ఆస్వాదిస్తున్నారు. అలానే కొందరు తల్లిదండ్రులు వినూత్నంగా సెలబ్రేట్‌ చేస్తున్నారు. ఇస్రో పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన సమయంలో పుట్టిన తమ బేబీస్‌కు చంద్రయాన్‌ పరిశోధనలో ఉపయోగించిన వస్తువుల పేర్లు సంబంధించిన పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జాబిల్లిని సూచించే పేర్లను సెలెక్ట్‌ చేస్తున్నారు.

ఆగష్టు 24 బుధవారం సాయంత్రం 6.04 గంటలకు భారత్‌ చంద్రుడిపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. జాబిల్లిపై మన చంద్రయాన్ అడుగు పెట్టే సమయంలో ఒడిశా రాష్ట్రంలోని పరాజిల్లా ఆసుపత్రిలో నలుగురు శిశువులు జన్మించారు. తలచువా గ్రామానికి దుర్గా మండలం అనే మహిళ, నీలకంఠాపూర్  గ్రామానికి చెందిన జోష్న్యారాణి, అంగులేయ్‌ గ్రామానికి చెందిన బేబీనా సేథి కూడా బుధవారం సాయంత్రం నలుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. వీరిలో ముగ్గురు బాబులు, ఒక పాప ఉన్నారు.

ఇక ఆ పిల్లల తల్లిదండ్రులు.. చంద్రయాన్-3 విజయాన్ని జీవితాంత గుర్తుంచుకోవాలని.. తమ బిడ్డలకు ఆ పేర్లు పెట్టాలని నిర్ణయించారు. తమ బాబుకు చంద్ర లేదా లూనా అని నామకరణం చేస్తామని ఓ తల్లి తెలిపింది. అలాగే చంద్రయాన్‌ మిషన్‌కు సంబంధించిన ల్యాండర్‌ ‘విక్రమ్’‌, రోవర్‌ ‘ప్రగ్యాన్ ’ వంటి పేర్లను కూడా మరికొంత మంది మిగిలిన బిడ్డల తల్లిదండ్రులు పరిశీలిస్తున్నారు. శిశువుల తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయంపట్ల ఆ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. మరి.. ఆ పిల్లల తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చంద్రయాన్-3 పనితీరుపై కీలక ప్రకటన చేసిన ఇస్రో..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి