iDreamPost

కేంద్రం కొత్త పథకం.. వారికి రూ. 3 లక్షల సాయం!

కేంద్రం కొత్త పథకం.. వారికి రూ. 3 లక్షల సాయం!

బడుగు బలహీన వర్గాల అభివద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అట్టడుగు వర్గాలను ఆర్థికంగా ఆదుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం ద్వారా రూ. 3 లక్షలు సాయం అందించేందుకు సిద్ధమైంది. ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాన్ని అందించనుంది. ఆ పథకమే పీఎం విశ్వకర్మ. ఈ పథకాన్ని నిన్న(ఆదివారం) ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన జన్మదినం సందర్భంగా ప్రారంభించారు. కాగా అర్హులైన ప్రతిఒక్కరు దరఖాస్తు చేసుకుని రుణాన్ని పొందాలని కోరారు. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు? అర్హతలు ఏంటీ? అనే వివరాలు మీకోసం..

కుల వృత్తులపై ఆదారపడి జీవించే 18 కులాల వారిని ఆదుకునేందుకు కేంద్రం పీఎం విశ్వకర్మ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథక ద్వారా రానున్న ఐదేళ్లలో దాదాపు 30 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. వీరికి రూ. 13 వేల కోట్ల రుణం అందించనుంది. చేతి పనిపై ఆదారపడే వారు, టూల్ కిట్ల సాయంతో పని చేసేవారికి ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగనుంది. అయితే ఈ పథకానికి అర్హత పొందిన వారికి తొలుత 18 నెలల వాయిదాలతో రూ. లక్ష అందింస్తారు. ఆ తర్వాత 30 నెలల వాయిదాతో రూ. 2 లక్షలు అందించనున్నారు. ఈ రుణానికి లబ్ధిదారులు 5 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. 8 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం భరించనుంది.

అర్హులు:

చేతి వృత్తుల ద్వారా ఉపాధి పొందుతున్న కుల వృత్తల వారైన.. వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, కమ్మరి, ఇనుప ని ముట్లు తయారు చేసేవారు, ఇంటి తాళాల తయారీదారులు, స్వర్ణకారులు, కుమ్మరి, విగ్రహాల తయారీదారులు (మూర్తికార్‌, స్టోన్‌ కర్వర్‌, స్టోన్‌ బ్రేకర్‌), చర్మకారులు, తాపీ మేస్త్రీలు, బాస్కెట్‌/మ్యాట్‌/బ్రూమ్‌ మేకర్‌/నారతాళ్లు చేసేవారు, సంప్రదాయ బొమ్మలు తయారు చేసేవారు, నాయీ బ్రాహ్మణులు, పూలదండలు తయారు చేసేవారు, రజకులు, దర్జీలు, చేప వలల తయారీదారులు అర్హులు.

అర్హతలు:

18 ఏళ్లు నిండిన వారు ఈ పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, కుల దృవీకరణ సర్టీఫికేట్, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, దరఖాస్తుదారుడి పాస్ ఫొటో, మొబైల్ నెంబర్ వంటి పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.

శిక్షణ:

కాగా పీఎం విశ్వకర్మ పథకానికి అర్హులైన వారిని గుర్తించి వారికి ముందుగా సర్టిఫికేట్ తో పాటు ఐడీ కార్డును అందచేస్తారు. లబ్ధిదారులకు ఏడు రోజుల వ్యవధిలో 40 గంటల పాటు ప్రాథమిక శిక్షణ అందిస్తారు. శిక్షణతో పాటు రోజుకు రూ. 500 స్టైఫండ్, టూల్ కిట్ల కోసం రూ. 15 వేలు అందిస్తారు. విశ్వకర్మలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ విషయంలో చేయూతనందించనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి