iDreamPost

ప్రమోషన్ ఇచ్చిన నెలకే.. ఉద్యోగంలోంచి తీసేసిన టెస్లా.. భారత టెకీ ఆవేదన

ఐటీ కంపెనీల్లో ఐదు అంకెల్లో జీతాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో ఫుల్ డిమాండ్ ఉండేది. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. ఐటీలో ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి వచ్చి పడింది.

ఐటీ కంపెనీల్లో ఐదు అంకెల్లో జీతాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో ఫుల్ డిమాండ్ ఉండేది. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. ఐటీలో ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి వచ్చి పడింది.

ప్రమోషన్ ఇచ్చిన నెలకే.. ఉద్యోగంలోంచి తీసేసిన టెస్లా.. భారత టెకీ ఆవేదన

వరల్డ్ వైడ్ గా ఐటీ రంగంలో అలజడి రేగుతోంది. దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఏ క్షణం ఉద్యోగం పోతుందో తెలియక ఎంప్లాయీస్ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రముఖ కంపెనీలన్నీ లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఐటీ సెక్టార్ నేడు వెలవెలబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ఆర్థిక మాంద్యం భయాలు కంపెనీలు ఉద్యోగులను తొలగించేందుకు కారణమవుతున్నాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి పలు కంపెనీలు. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లాలో లేఆఫ్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో భారతీయ టెకీ తన ఉద్యోగం కోల్పోయింది. నెల క్రితం ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడు ఉద్యోగంలోంచి తీసేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ ఏడాది ఆరంభంలోనే ఐటీ కంపెనీల్లో వేల మంది ఉద్యోగాలు ఊడినయ్. కొత్త నియామకాలు కూడా జరగడం లేదు. దీంతో బీటెక్ చేసిన వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు 80 వేల మంది టెక్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారని పలు రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో టెస్లా చేపట్టిన తొలగింపుల్లో భారతీయ టెకీ ఉద్యోగం కోల్పోయింది. ఏడేళ్లపాటు ఉద్యోగం చేసిన ఆమెను టెస్లా కంపెనీ హఠాత్తుగా జాబ్ నుంచి తీసేసింది. ఈ లేఆఫ్ కి సంబంధించి ఆమె సోదరుడు జతిన్ సైనీ లింక్డిన్ లో పోస్ట్ చేశారు.

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాలో తన సోదరిని తొలగిస్తూ పంపిన మెయిల్ స్క్రీన్ షాట్లను జతిన్ సైనీ పోస్ట్ చేశారు. టెస్లా కంపెనీలో తన సోదరి ఏడేళ్ల పాటు నమ్మకంగా పని చేసిందని, గత శుక్రవారం ఉద్యోగం నుంచి తొలగించేసినట్లు తెలిపారు. కంపెనీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా తనను తీసేస్తున్నట్లు మెయిల్ లో పేర్కొన్నారు. అయితే, నెల రోజుల క్రితమే ఆమెకు ప్రమోషన్ ఇచ్చారని, దీంతో తమ సోదరి ఎంతో సంతోషించిందని చెప్పారు. కానీ, మే 3 వ తేదీన విధులకు వెళ్లిన ఆమెకు తన కార్డు పని చేయకపోవడంతో తన భవిష్యత్ ప్రశ్నార్థకం అయిపోయినట్లు చెప్పారు. ఆమె టీమ్ లో దాదాపు 75 శాతం మందిని తొలగించినట్లు వెల్లడించారు. ఏడేళ్ల తర్వాత ఒక్క ఇ-మెయిల్ తో టెస్లా కంపెనీ తన ఉద్యోగం తీసేయడం పట్ల తన సోదరి తీవ్ర ఆవేదనకు గురైందని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి