iDreamPost
android-app
ios-app

విషం తాగి కానిస్టేబుల్ ఆత్మహత్య! ఎందుకంటే?

విషం తాగి కానిస్టేబుల్ ఆత్మహత్య! ఎందుకంటే?

గత కొన్ని రోజుల నుంచి పోలీస్ శాఖలో పని చేస్తున్న కొందరు పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు విధుల్లో ఉండగా తుపాకీతో ఆత్మహత్య చేసుకుంటుంటే.. మరికొందరు పురుగుల మందు తాగి, ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. అయితే, ఈ వరుస ఘటనలు మరువకముందే మరో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అతడు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడంటే?

పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి పరిధిలోని చిన్నబోనాల గ్రామంలో బండ అరుణ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు ఓ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. అరుణ్ గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ, కొన్ని రోజులు గడిచిన తర్వాత కుటుంబ కలహాలతో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కిరణ్ కోమలత అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఈ క్రమంలోనే అరుణ్ కు తన మొదటి భార్య జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని సన్నిహితులతో చెప్పి తరుచు బాధపడుతుండేవాడట.

దీంతో అతడు తీవ్ర మనస్థాపానికి గురైనట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అరుణ్ ఈ నెల 11న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ కానిస్టేబుల్ అరుణ్ శుక్రవారం ప్రాణాలు విడిచాడు. కానిస్టేబుల్ అరుణ్ మరణవార్త తెలుసుకుని అతని కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు శోక సంద్రంలో మునిగిపోయారు. అనంతరం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: భార్యను నెల రోజులు గదిలో పెట్టి తాళం వేసిన భర్త! ఎందుకో తెలుసా?

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet