iDreamPost
android-app
ios-app

భార్యను నెల రోజులు గదిలో పెట్టి తాళం వేసిన భర్త! ఎందుకో తెలుసా?

భార్యను నెల రోజులు గదిలో పెట్టి తాళం వేసిన భర్త! ఎందుకో తెలుసా?

భార్యను గదిలో పెట్టి తాళం వేసిన భర్త. అలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు.. ఏకంగా నెల రోజుల పాటు ఇల్లాలిని గదిలోనే ఉంచి నరకం అంటే ఏంటో బతికుండగానే చూపించాడు. వినటానికి భయంకరంగా ఉన్న ఇది నిజం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరమైన చర్య స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలు భర్త భార్యను అన్ని రోజులు గదిలో ఉంచి తాళం వేయడానికి కారణం ఏంటి? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు మీకోసం.

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని రంగాపురం కాలనీ. ఇక్కడే చాను- అబ్దుల్ నాజా మునిషా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 6 ఏళ్ల కిందట వివాహం జరిగింది. అయితే, భర్త పలమనేరు ఆర్టీసీ డిపోలో హొంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కూతురు జన్మించింది. ఆడపిల్ల పుట్టడంతో భర్త భార్యపై కోపం పెంచుకున్నాడు. ఇదే విషయంపై గతంలో భార్యాభర్తలు గొడవ కూడా పడ్డారు. ఇక భర్త పెట్టే టార్చర్ కు అతనితో ఉండలేని ఆ ఇల్లాలు పుట్టింటికి వెళ్లింది.

ఆ మహిళ కుటుంబ సభ్యులు స్పందించి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. పెద్దలు నచ్చచెప్పి ఇక నుంచైనా మంచిగా ఉండాలంటూ భర్తను హెచ్చరించారు. ఇప్పటి నుంచైనా మొగుడు బుద్దిగా ఉంటాడని భార్యతో పాటు అందరూ భావించారు. కానీ, కుక్క తోక వంకర అన్నట్లు అతడు మళ్లీ అదే దారిలో వెళ్లాడు. ఈ క్రమంలోనే అతని భార్య మరోసారి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో అతని కోపం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె భర్త మరో దారుణానికి పాల్పడ్డాడు. మరోసారి ఆడపిల్లకు జన్మనిచ్చిందనే కారణంతో భర్త భార్యను గత నెల రోజులు గదిలో పెట్టి తాళం వేశాడు.

ఇక బయటకు రాలేని ఆ మహిళ బాత్ రూమ్ నీళ్లు తాగుతూ నెల రోజులు ప్రాణాలు కాపాడుకుంది. ఇక బతికుండగానే నరకం చూపించిన భర్త దారుణంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. చాలా రోజుల నుంచి కూతురు సమాచారం తెలియకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సాయంతో వాళ్లు వెంటనే కూతురి ఇంటికి వెళ్లి చూసే సరికి.. భర్త గదిలో బంధించి నెల రోజులుగా ఇంటికి తాళం వేశాడని ఆమె తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులు ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఆడ పిల్లకు జన్మనిచ్చిందని బతికుండగానే భార్యకు నరకం చూపించిన ఈ దుర్మార్గుడి ఘోరంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: అప్పుడు భర్త, ఇప్పుడు భార్య.. కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన!

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetjojobetMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabetHoliganbetJojobetHoliganbetJojobetHoliganbetJojobet GirişJojobet Giriş