iDreamPost

ఒకే ఏడాదిలో పవన్ మూడో రీమేక్

సబ్జెక్టులు కూడా అలాంటివే కావడంతో రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ సూత్రంతో నిర్మాతలు వర్కౌట్ చేసుకున్నారు. ఇప్పుడు మూడో దానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

సబ్జెక్టులు కూడా అలాంటివే కావడంతో రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ సూత్రంతో నిర్మాతలు వర్కౌట్ చేసుకున్నారు. ఇప్పుడు మూడో దానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

ఒకే ఏడాదిలో పవన్ మూడో రీమేక్

ఏడాది గ్యాప్ లో పవన్ కళ్యాణ్ చేసిన రెండు రీమేక్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చేశాయి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లు అద్భుతాలు చేయకపోయినా వాటికి పెట్టిన బడ్జెట్ కు తగ్గట్టు బాగానే పెర్ఫార్మ్ చేశాయి. సబ్జెక్టులు కూడా అలాంటివే కావడంతో రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ సూత్రంతో నిర్మాతలు వర్కౌట్ చేసుకున్నారు. ఇప్పుడు మూడో దానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది సోనీ లివ్ లో ఓటిటి రిలీజ్ గా వచ్చిన వినోదయ సితం మీద త్రివిక్రమ్ రికమండేషన్ తో పవన్ మనసు పారేసుకున్న సంగతి తెలిసిందే. సముతిరఖని దర్శకత్వం వహించి కీలక పాత్ర పోషించిన ఈ ఫాంటసీ ఎంటర్ టైనర్ కి ప్రేక్షకుల నుంచి మంచి ప్రసంశలు, భారీ వ్యూస్ దక్కాయి.

Vinodaya Sitham Remake
జనసేన కార్యకలాపాల దృష్ట్యా పవన్ ఇది చేస్తాడా లేదా అనే అనుమానాలు కొద్దిరోజులు వెంటాడాయి. తాజా సమాచారం మేరకు అలాంటిదేమి లేదట. సెప్టెంబర్ మొదటి వారం నుంచి నిర్విరామంగా చిత్రీకరణ చేయబోతున్నట్టు తెలిసింది. కేవలం 20 రోజుల కాల్ షీట్స్ మాత్రమే అవసరమయ్యేలా షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన ఆర్టిస్టుల సీన్లకు కొంత ఎక్కువ అవసరం అయినప్పటికీ పవర్ స్టార్ పార్ట్ మటుకు వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ హ్యాండిల్ చేసిన సముతిర ఖనినే తెలుగులోనూ దర్శకత్వ బాధ్యతలు తీసుకోబోతున్నారు. దానికి అనుగుణంగానే వచ్చే నెల డేట్స్ ఇవ్వలేదట.

మొత్తానికి హరిహర వీరమల్లు కంటే ముందే ఈ వినోదయ సితం రీమేక్ వస్తుందన్న మాట. దీనికీ త్రివిక్రమే రచన చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఒరిజినల్ వెర్షన్ లో తంబి రామయ్య క్యారెక్టర్ ని ఇక్కడ సాయి ధరమ్ తేజ్ తో చేయించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతున్నా కథ పరంగా చేసిన కీలకమైన మార్పు బాగా కుదిరిందని అంటున్నారు. మావయ్యలంటే ప్రాణమిచ్చే సాయి తేజ్ కు ఇన్నేళ్ల తర్వాత ఆయనతో స్క్రీన్ పంచుకునే అవకాశం దక్కడం విశేషం. సంగీత దర్శకుడు ఇతర సాంకేతిక విభాగం తాలూకు వివరాలు రావాల్సి ఉంది . ఈ లెక్కన 2023లో దీంతో పాటు హరిహర వీరమల్లు వచ్చేస్తాయి. మరి భవదీయుడు భగత్ సింగ్ సంగతి ఏమిటో వేచి చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి