iDreamPost

సుప్రీంకోర్టులో బేషరతుగా క్షమాపణలు చెప్పిన బాబా రామ్‌దేవ్! కారణం?

  • Published Apr 02, 2024 | 2:23 PMUpdated Apr 02, 2024 | 2:25 PM

ప్రముఖ యోగ గురు.. కొంతకాలం కిందట పతంజలి కేసు విషయమై న్యాయస్థానం నుంచి.. షోకాజ్ నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రామ్ దేవ్ బాబా క్షమాపణలు తెలిపారు. దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ యోగ గురు.. కొంతకాలం కిందట పతంజలి కేసు విషయమై న్యాయస్థానం నుంచి.. షోకాజ్ నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రామ్ దేవ్ బాబా క్షమాపణలు తెలిపారు. దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Apr 02, 2024 | 2:23 PMUpdated Apr 02, 2024 | 2:25 PM
సుప్రీంకోర్టులో బేషరతుగా క్షమాపణలు చెప్పిన బాబా రామ్‌దేవ్! కారణం?

గతంలో రామ్ దేవ్ బాబాకు చెందిన ప్రముఖ సంస్థ వ్యాపార ప్రకటనలపై.. న్యాయస్థానం స్పందించడం. ఆ ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రామ్ దేవ్ కు.. షోకాజ్ నోటీసులు జారీచేసిన సంగతి. బాబా రామ్ దేవ్, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణన్ తమ న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే వారిద్దరూ న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో.. కోర్టు వారు వారిద్దరిని తీవ్రంగా మందలించింది. కోర్టు వారి ఆదేశాలను సీరియస్ గా తీసుకోవాలని సూచించింది. కోర్టు వారు సూచించిన విధంగా.. బాబా రామ్ దేవ్ అందరికి క్షమాపణలు తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వీరిద్దరి విచారణలో కోర్టు.. పవిత్రమైన పదానికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసినట్లు రామ్‌దేవ్, బాలకృష్ణ నిర్ధారించుకోవాలని .. విచారణలో పేర్కొంది. ఈ క్రమంలో అడ్వర్టైజ్‌మెంట్ కేసులో తాజా అఫిడవిట్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని.. పతంజలి విజ్ఞప్తి చేయడంతో.. ఆ విషయంలో సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విషయంలో వీలైనంత త్వరగా ముగింపు పలకాలని తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులు ఇచ్చే ప్రతి ఉత్తర్వును గౌరవించాలని.. కూడా కోర్టు వారిని ఆదేశించింది. వారికి చివరి అవకాశంగా ఏప్రిల్ 10 వరకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో తదుపరి విచారణలో కూడా వీరిద్దరూ హాజరు కావాల్సి ఉంది.

ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఆదేశించిన వాటికి.. పతంజలి ఇలా సమాధానం ఇచ్చింది. “పతంజలి ఉత్పత్తులకు ఔషధ యోగ్యత ఉందని పేర్కొంటూ.. చట్టాన్ని ఉల్లంఘించి దీని గురించి ఎలాంటి ప్రకటన చేయబోము.” అంటూ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చింది. ఇక సుప్రీం కోర్టు కూడా ఏ విధమైన మీడియాలోనూ వైద్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు జారీ చేయకూడదని సూచించింది. ఇక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎం డిమాండ్ చేసిందంటే.. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం 1954ను.. అతిక్రమించినందుకు.. పతంజలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్ దేవ్ పై.. పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. మరి వీరికి ఇచ్చిన ఆఖరి గడువు ముగిసేలోపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వేచి చూడాలి. మరిఎం ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి