Somesekhar
సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే?
సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే?
Somesekhar
దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఆసీస్ ప్లేయర్ల పంటపండింది. కోట్లు కుమ్మరించి మరీ కంగారూ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఇక ఈ వేలంలో అత్యధిక ధర పలికి రికార్డులు బద్దలు కొట్టాడు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్. అతడిని ఏకంగా రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది కోల్ కత్తా నైట్ రైడర్స్. ఇక ఆ తర్వాత అంతటి ధరను వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దక్కించుకున్నాడు. అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే SRH ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2024 వేలం తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బలంగా మారిందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా బౌలింగ్ దళం బలపడింది. ఈ ఐపీఎల్ మినీ వేలంలో ఆసీస్ స్టార్ బౌలర్, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ను రూ. 20.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మరో స్టార్ బౌలర్ వనిందు హసరంగను కొనుగోలు చేసింది సన్ రైజర్స్. ఇటు బ్యాటింగ్ లో వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ ను కొనుగోలు చేసి బ్యాటింగ్ ను కూడా పటిష్టం చేసుకుంది. ఇదిలా ఉండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే?
ప్రస్తుతం SRH టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సౌతాఫ్రికా స్టార్ మార్క్రమ్ ను తొలగించి.. ప్యాట్ కమ్మిన్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని కావ్య పాప భావిస్తుందట. కంగారూ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన అపార అనుభవం కమ్మిన్స్ సొంతం. తాజాగా జరిగిన వన్డే వరల్డ్ కప్ తో పాటుగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీని ఆసీస్ జట్టుకు అందించాడు కమ్మిన్స్. కాగా.. గత సీజన్లలో దారుణ వైఫల్యాలను చవిచూస్తున్న సన్ రైజర్స్ కమ్మిన్స్ కెప్టెన్సీలో నైనా అద్భుత ప్రదర్శన చేస్తుందో వేచిచూడాలి. మరి సన్ రైజర్స్ కెప్టెన్ గా ఎవరిని నియమిస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.