iDreamPost

దేశ‌ ఆర్ధిక ప‌రిస్థితి బాగాలేదు. టీ తాగ‌టం త‌గ్గించండి, ప్ర‌జ‌ల‌కు పాక్ రిక్వెస్ట్

దేశ‌ ఆర్ధిక ప‌రిస్థితి బాగాలేదు. టీ తాగ‌టం త‌గ్గించండి, ప్ర‌జ‌ల‌కు పాక్ రిక్వెస్ట్

దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ కుదురుకోవాలంటే మీరు టీ త‌క్కువ తాగాలి. గంట‌కో క‌ప్పు చొప్పున తాగితే దేశం దివాళాతీయ‌డం ఖాయం. దిగుమతులు పెరుగుతాయి. ఉన్న విదేశీ క‌రెన్సీ నిల్వ‌లు క‌రిగిపోతాయి. ప్లీజ్ అంటూ ప్ర‌జ‌ల‌ను పాక్ ప్ర‌భుత్వం వేడుకొంటోంది. టీని ఎక్కువ‌గా దిగుమ‌తి చేసుకొనే దేశాల్లో పాక్ ఒక‌టి.

మీరు ఒక‌టి లేదంటే రెండు క‌ప్పుల టీతో స‌రిపెట్టుకొంటే, ఆర్ధిక క‌ష్టాల నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం దొరుకుతుంద‌ని పాక్ ప్లానింగ్ అండ్ డ‌వ‌ల‌ప్మెంట్ మంత్రి అహసాన్ ఇక్బాల్ కోరుతున్నారు. టీని దిగుమ‌తి చేసుకోవ‌డ‌నికి అప్పులు చేస్తున్నాం. ప‌రిస్థితిని అర్దం చేసుకోమంటున్నారు. ఒక్క 2020లోనే పాకిస్తాన్ 640 మిలియ‌న్ డాల‌ర్ల మేర టీని దిగుమ‌తి చేసుకుంది. ఇండియ‌న్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.5,000కోట్లు. అస‌లే రాబ‌డిలేదు. డాల‌ర్లు లేవు. దీనికితోడు ద్ర‌వ్యోల్బ‌ణం. రేట్లు పెరుగుతున్నాయి. ర‌ష్యా ఉక్రెయిన్ యుద్ధంవ‌ల్ల చ‌మురు రేట్లు కూడా పెరుగుతున్నాయి. పాక్ నిజంగా ఆర్ధిక క‌ష్టాల్లో ఉంది.

టీతాగ‌టాన్ని త‌గ్గించ‌మంటే సోష‌ల్ మీడియా ఊరుకొంటుందా? ప్ర‌భుత్వ అస‌మ‌ర్ధ‌త‌వ‌ల్లే ధరలు పెరిగాయి. వీటిని త‌గ్గించ‌కుండా టీ తాగొద్దంటే ఎలా అని సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లు టీ తాగ‌డ‌టానిన త‌గ్గిస్తే దేశ ఆర్ధిక‌వ్య‌వ‌స్థ ఎలా బాగుప‌డుతోందో ప్ర‌జ‌ల‌కు అర్ధంకావడంలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి