iDreamPost

Babar Azam: బాబర్ ఆజం పరువు తీసిన నటి.. ఇంతకంటే దారుణం ఉండదు!

  • Published Apr 25, 2024 | 5:36 PMUpdated Apr 25, 2024 | 5:36 PM

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం పరువు మళ్లీ పోయింది. అతడిపై ఓ నటి చేసిన వ్యాఖ్యలతో ఆజం అభిమానులు ఆగమాగం అవుతున్నారు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం పరువు మళ్లీ పోయింది. అతడిపై ఓ నటి చేసిన వ్యాఖ్యలతో ఆజం అభిమానులు ఆగమాగం అవుతున్నారు.

  • Published Apr 25, 2024 | 5:36 PMUpdated Apr 25, 2024 | 5:36 PM
Babar Azam: బాబర్ ఆజం పరువు తీసిన నటి.. ఇంతకంటే దారుణం ఉండదు!

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఏదో ఒక విషయంలో అతడు హైలైట్ అవుతుంటాడు. అయితే పాజిటివ్​గా కాదు.. అతడిపై నెగెటివ్​ న్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకు కారణం బాబర్ ఆటతీరు ఒకటైతే, ఇంకొకటి అతడి అభిమానుల ఓవరాక్షన్. ప్రస్తుత క్రికెట్​లో బాబర్​ను మించినోళ్లు ఎవరూ లేరని, విరాట్ కోహ్లీ కంటే అతడే తోపు అంటూ పాక్ ఫ్యాన్స్ బిల్డప్ ఇస్తుంటారు. అయితే చిన్న జట్లపై అదరగొట్టే బాబర్.. పెద్ద టీమ్స్​తో కీలక మ్యాచుల్లో మాత్రం తడబడుతుంటాడు. అందుకే ఆజంను అందరూ ట్రోల్ చేస్తుంటారు. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువంటూ విమర్శిస్తుంటారు. అలాంటి పాక్ కెప్టెన్ మరోమారు పరువు పోగొట్టుకున్నాడు.

పాకిస్థాన్​కు చెందిన టెలివిజన్ నటి నజీష్ జహంగీర్ చేసిన వ్యాఖ్యలతో బాబర్​ పరువు పోయింది. బుల్లితెర నటిగా మంచి క్రేజ్ సంపాదించిన నజీష్​కు ఇన్​స్టాగ్రామ్​లో 12 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందం, అభినయంతో ఎంతో మంది మనసుల్ని ఆమె దోచుకున్నారు. అలాంటి ఈ నటి ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు గానూ రియాక్ట్ అయిన తీరు వైరల్ అవుతోంది. బాబర్ ఆజం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని అడిగితే మీరేం చెబుతారు? అని నజీష్​కు ఒక అభిమాని నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి వెంటనే ‘సారీ చెబుతాను’ అంటూ సున్నితంగా తిరస్కరిస్తాననే అర్థంలో ఆన్సర్ ఇచ్చారు. అయితే ఈ కన్వర్జేషన్​కు సంబంధించిన స్క్రీన్​షాట్​ను ఆమె నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది.

బాబర్​ను పెళ్లి చేసుకోనంటూ నజీష్ చేసిన వ్యాఖ్యలతో అతడి అభిమానులు హర్ట్ అయ్యారు. తమ ఫేవరెట్ క్రికెటర్​ను ఆమె అవమానించిందని, ఇది బాబర్ పరువు తీయడమేనని సీరియస్ అవుతున్నారు. నజీష్​ను టార్గెట్ చేసుకొని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆమె మరో ఇన్​స్టా స్టోరీ ఇప్పుడు తెరమీదకు వచ్చింది. బాబర్ తనకు సోదరుడి లాంటి వాడని.. కానీ అతడి ఫ్యాన్స్ మాత్రం ఇలా నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారని, తనను ఇబ్బంది పెడుతున్నారని నజీష్ సీరియస్ అయినట్లు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక, వన్డే ప్రపంచ కప్-2023లో పాక్ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించడంతో బాబర్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. అయితే ఆ తర్వాత సారథ్య బాధ్యతలు చేపట్టిన షాహిన్ అఫ్రిది (టీ20లు) ఫెయిలవడంతో మళ్లీ బాబర్​నే కెప్టెన్ చేసింది పీసీబీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి