iDreamPost

ఆ కారణాలతో ఎక్స్ ను బ్యాన్ చేసిన పాకిస్థాన్.. ఫైట్ చేసేందుకు ఎలాన్ మస్క్ రెడీ

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ పై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ పాక్ తో ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ పై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ పాక్ తో ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఆ కారణాలతో ఎక్స్ ను బ్యాన్ చేసిన పాకిస్థాన్.. ఫైట్ చేసేందుకు ఎలాన్ మస్క్ రెడీ

సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (ట్విట్టర్) కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉంది. ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ఎన్నో మార్పులు చేశారు. ఏకంగా లోగోను మార్చి అందరికీ షాక్ ఇచ్చాడు. కొత్త రూల్స్ ప్రవేశ పెట్టి యూజర్లకు షాక్ ఇచ్చాడు మస్క్. ఎక్స్ యూజర్లు తమ భావాలను వ్యక్త పరిచేందుకు ఈ వేదికను విరివిగా వినియోగిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో చేసే ట్వీట్లు గొడవలకు కారణమయ్యే విధంగా.. హింసకు దారితీసే విధంగా ఉంటాయి. ఈ సమయంలో ఆయా ప్రభుత్వాలు ట్విట్టర్ పై నిషేదం విధిస్తుంటాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఎక్స్ పై నిషేదం విధించింది. దీంతో ఆక్కడి యూజర్లు ఎక్స్ ను యాక్సెస్ చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మస్క్ పాక్ తో ఫైట్ కు రెడీ అవుతున్నారు.

పాకిస్తాన్ ఎక్స్ పై ఫిబ్రవరిలోనే బ్యాన్ విధించింది. భద్రతాపరమైన సమస్యలను కారణంగా చూపి పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్స్ ను నిషేధించింది. అయితే తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా దృవీకరించింది. ఈ వ్యవహారంపై ఎలాన్ మాస్క్ ఎక్స్ కు చెందిన సిబ్బంది కోర్టును ఆశ్రయించారు. ఎక్స్‌పై నిషేధాన్ని రద్దు చేయాలని మస్క్ యాజమాన్యం పాకిస్థాన్ సింధ్ హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన హైకోర్టు ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే పాక్ మాత్రం ఎక్స్ ప్లాట్‌ఫారమ్ దుర్వినియోగానికి గురవుతుందని అఫిడవిట్ దాఖలు చేసింది. జాతీయ భద్రతా సమస్యలను పరిష్కరించడంలో ఎక్స్ విఫలమైందని వెల్లడించింది.

ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు సాఫీగా జరిగేందుకు.. సోషల్ మీడియా ప్రభావం ఎలక్షన్స్ పై పడకుండా ఉండేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను పాకిస్తాన్ ప్రభుత్వం బ్లాక్ చేసింది. అయితే ఎన్నికల అనంతరం చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మళ్లీ పని చేయడం ప్రారంభించాయి. కానీ ఎక్స్ యూజర్లు తమ ఖాతాలను యాక్సెస్ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ పాక్ తో ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎక్స్ ను మళ్లీ వినియోగంలోకి తెచ్చేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి