iDreamPost

పాక్ కు కిలోమీటర్ దూరంలో అదానీ డేరింగ్ స్టెప్! అట్లుంటది అదానీతోని!

Adani Green Energy: అదానీ గ్రూప్ కి అనుబంధ సంస్థ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అరుదైన ఘనతను సాధించింది. అంతేకాక పాకిస్థాన్ కి గట్టి షాక్ అదానీ గ్రూ ప్ ఇచ్చిందనే చెప్పొచ్చు. మరి.. అదానీ సంస్థ ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Adani Green Energy: అదానీ గ్రూప్ కి అనుబంధ సంస్థ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అరుదైన ఘనతను సాధించింది. అంతేకాక పాకిస్థాన్ కి గట్టి షాక్ అదానీ గ్రూ ప్ ఇచ్చిందనే చెప్పొచ్చు. మరి.. అదానీ సంస్థ ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

పాక్ కు కిలోమీటర్ దూరంలో అదానీ డేరింగ్ స్టెప్! అట్లుంటది అదానీతోని!

అదానీ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యాపారంలోని దాదాపు అన్నిటిలోనూ  అదానీ గ్రూప్ సంస్థ ఉంది. ఈ సంస్థకు అనేక అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. ఈ సంస్థ ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సోలార్ పునరుత్పాదక  ప్లాంట్ లను ఏర్పాటు చేసింది. తాజాగా గుజరాత్ లో అందులోనూ పాకిస్థాన్ కి అత్యంత సమీపంలో మరో పెద్ద సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఇది పాకిస్థాన్ కి గట్టి షాకే అని పలువురు అభిప్రాయా పడుతున్నారు. మరి.. అందుకు గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అదానీ గ్రూప్ కి అనుబంధ సంస్థ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అరుదైన ఘనతను సాధించింది. గుజరాత్ లోని కాబ్డా ప్రాంతంలో సోలార్ పార్క్ లో 2 వేల మెగావాట్ల సౌర ఇంధన ను కొంత కాలం క్రితం ప్రారంభించింది. ఇటీవలే ఈ సౌర ఇంధన అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో దేశీయంగా 10 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఉన్న మొదటి కంపెనీగా అదానీ నిలిచింది. ప్రస్తుతం కంపెనీ నిర్వహణ, పోర్టుపోలియో 10,934 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో 7,393 మెగావాట్లు సోలార్, 1400 మెగావాట్ల పవన్ విద్యుత్, 2140 మెగవాట్ల పవన్, సోలార్ హైబ్రిడ్ విద్యుత్ సామార్థ్యం కలిగి ఉన్నట్లు అదానీ సంస్థ పేర్కొంది.

2030 నాటికి  45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ వెల్లండించింది. ప్రస్తుతం ఉన్న పునరుత్పాద ఇంధన సామర్థ్యంతో 50 లక్షల ఇళ్లకు విద్యుత్ ను అందించవచ్చు. భారత దేశంలోనే అతిపెద్ద, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సోలార్ సంస్థ అయినా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి ఈ సంస్థ గుజరాత్ లోని కబ్డాలో ఏర్పాటు చేయబడింది. ఈ  పార్క్ లో  పెద్ద మొత్తంలో విద్యుత్ ను సరఫరా చేయడం ద్వారా 551 మెగవాట్ల సౌర సామర్థ్యాన్ని ప్రారంభించింది. ఇంత పెద్ద పార్క్ అంతరిక్షం నుంచి చూసిన కనిపిస్తుందట. ప్రస్తుతం ఈ ప్రాంతం క్లీన్ ఎనర్జీ వెంచర్ కోసం ఏర్పాటు అయ్యింది. ఇది 538 చ.కి.మీ మేరకు విస్తిరణంలో ఉంది.

 ఇంకా చెప్పాలంటే.. పారిస్ నగరం కంటే ఐదు రెట్లు పెద్దగా ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి గరిష్టంగా 81 బిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. అంటే బెల్జియం, చిలీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు సరిపడా విద్యుత్ ను.. ఇక్కడ ఉత్పత్తి చేయగలదని నిపుణులు చెబుతున్నారు. లడక్ తరువాత దేశంలోనే అత్యుత్తమ సౌర వికిరణాన్ని మైదాన ప్రాంతంలో ఉండే కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. ఉంది. పాకిస్థాన్ కి   కేవలం ఒక కిలో మీటర్ల దూరంలోనే ఉంది. దీంతో ఈ పార్క్ ను బపర్ జోన్ గా ప్రకటించి , సరిహద్దు భద్రత దళం గస్తీ నిర్వహిస్తుంది. మొత్తంగా ఇది పాకిస్థాన్ కి గట్టి షాకే అని నిపుణులు అభిప్రాయా పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి