iDreamPost
android-app
ios-app

World Cup: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో పాక్‌ చీటింగ్‌! బౌండరీ లైన్‌ వెనక్కి నెట్టి..

  • Published Oct 07, 2023 | 1:45 PM Updated Updated Oct 07, 2023 | 1:45 PM
  • Published Oct 07, 2023 | 1:45 PMUpdated Oct 07, 2023 | 1:45 PM
World Cup: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో పాక్‌ చీటింగ్‌! బౌండరీ లైన్‌ వెనక్కి నెట్టి..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్‌-నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన వివాదస్పదంగా మారింది. నెదర్లాండ్స్‌ బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో పాకిస్థాన్‌ ఫీల్డర్‌ బౌండరీ లైన్‌ను మరింత వెనక్కి నెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ 30 నిమిషాల పాటు ఆ బౌండరీలైన్‌ మ్యాచ్‌ ప్రారంభమైనప్పుడు ఉన్న ప్లేస్‌ కంటే కాస్త వెనక్కి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై క్రికెట్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌ చీటింగ్‌ చేసిందంటూ పేర్కొంటున్నారు. అయితే.. నిజంగానే పాక్‌ ఫీల్డర్‌ బౌండరీ లైన్‌ను ఉద్దేశం పూర్వకంగా వెనక్కి నెట్టాడా? లేక అతను ఫీల్డింగ్‌ చేస్తున్న క్రమంలో బౌండరీని ఆపే ప్రయత్నంలో డైవ్‌ చేసిన క్రమంలో బౌండరీ లైన్‌ వెనక్కి జరిగిందా? అనే విషయాలు కూడా చర్చలో ఉన్నాయి.

కానీ, ఎక్కువ మంది నెటిజన్లు మాత్రం కావాలనే పాక్‌ ఫీల్డర్‌ బౌండరీ లైన్‌ను వెనక్కి నెట్టి ఉంటాడని భావిస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కాగా, చాలా సందర్భాల్లో ఫీల్డర్లు బౌండరీ లైన్‌లో ఫోర్లను ఆపే ప్రయత్నంలో భాగంగా బౌండరీ లైన్‌ కాస్త వెనక్కి జరిగినా.. గ్రౌండ్‌ స్టాఫ్‌ వెంటనే దాన్ని సరిచేస్తుంటారు. అయితే.. పాక్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ సందర్భంగా.. బౌండరీ లైన్‌ ఏ విధంగా వెనక్కి వెళ్లినా.. దాన్ని ఓ 30 నిమిషాల పాటు అలానే ఉంచేశారు. కాగా, పాక్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ చివరి వరకు హోరాహోరీగా సాగకుండా.. వన్‌సైడ్‌గా మారిన తరుణంలో ఇది అంత పెద్దగా వివాదం కాలేదు. కానీ, మ్యాచ్‌ చివరి బాల్‌ వరకు నెక్‌ టూ నెక్‌గా వెళ్లి ఉంటే.. మాత్రం పెద్ద వివాదం అయ్యేది.

ఎందుకంటే.. చివరి బాల్‌కు సిక్స్‌ కావాల్సిన దశలో బాల్‌ సరిగ్గా బౌండరీ లైన్‌ వెనక్కి జరిగిన చోట పడితే.. మ్యాచ్‌ ఫలితమే మారిపోతుంది. బౌండరీ లైన్‌ ఉండాల్సిన చోట ఉంటే సిక్స్‌తో ఆరు పరుగులు వచ్చి మ్యాచ్‌ గెలవచ్చు. కానీ, బౌండరీ లైన్‌ వెనక్కి జరిగి ఉంటే.. దాని కంటే కాస్త ముందు, కొన్ని ఇంచుల ముందు బాల్ పడితే.. కేవలం 4 పరుగులకే వస్తాయి. మ్యాచ్‌ ఓడిపోతారు. బౌండరీ లైన్‌ వెనక్కి జరగడం వల్ల ఇంత ప్రమాదం ఉంటుంది. కానీ, పాక్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లో ఈ తప్పిందం ఎలా జరిగినా? దాదాపు 30 నిమిషాల పాటు బౌండరీ లైన్‌ వెనక్కి ఉండటం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup 2023: ఆసీస్‌తో మ్యాచ్‌కు ఇప్పటికే గిల్‌ దూరం! తాజాగా మరో ప్లేయర్‌..