iDreamPost
android-app
ios-app

OTTని షేక్ చేస్తున్న పంచాయత్ సీజన్ 3.. ఎందుక ఇంకా చూడలేదు?

OTT Suggestions- Panchayat Season 3: ఓటీటీలో ప్రస్తుతం పంచాయత్ సీజన్ 3 ఫుల్ ట్రెండ్ అవుతోంది. మొదటి రెండు సీజన్స్ తరహాలోనే ఈ సీజన్ కూడా మంచి వైరల్ గా మారింది. అయితే ఎందుకు ఇంత క్రేజ్ అనే విషయం ఎప్పుడన్నా ఆలోచించారా?

OTT Suggestions- Panchayat Season 3: ఓటీటీలో ప్రస్తుతం పంచాయత్ సీజన్ 3 ఫుల్ ట్రెండ్ అవుతోంది. మొదటి రెండు సీజన్స్ తరహాలోనే ఈ సీజన్ కూడా మంచి వైరల్ గా మారింది. అయితే ఎందుకు ఇంత క్రేజ్ అనే విషయం ఎప్పుడన్నా ఆలోచించారా?

OTTని షేక్ చేస్తున్న పంచాయత్ సీజన్ 3.. ఎందుక ఇంకా చూడలేదు?

ఓటీటీలు వచ్చిన తర్వాత అందరూ ఎంతో ఇష్టంగా వెబ్ సిరీస్లు చూస్తున్నారు. గతంలో వెబ్ సిరీస్ అంటే నెట్ ఫ్లిక్స్ మీద ఎక్కువ ఆధారపడాలి. కానీ, అవన్నీ హాలీవుడ్ వెబ్ సిరీస్లు మాత్రమే ఉండేవి. కానీ, అవి తెలుగులో కూడా వచ్చేవి కావు. కానీ, ఇప్పుడు ఇండియా అనేది ఓటీటీలకు బెస్ట్ మార్కెట్ గా మారిపోయింది. అందుకే మన దగ్గరే ఎక్కువ ఓటీటీలు పుట్టుకొచ్చాయి. ఓటీటీలు పెరిగిన తర్వాత నేటివ్ గా వెబ్ సిరీస్లు కూడా వస్తున్నాయి. అలాంటి ఎన్నో వెబ్ సిరీస్లు రావడమే కాదు.. అభిమానులను సూపర్ ఎగ్జైట్ కూడా చేశాయి. అలాంటి ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. రికార్డు స్థాయి వ్యూస్ దూసుకుపోతోంది.

పాన్ ఇండియా లెవల్లో కొన్ని వెబ్ సిరీస్లు బాగా వైరల్ అయ్యాయి. వాటికి ఎన్ని సీజన్స్ వచ్చినా కూడా వదలకుండా ప్రేక్షకులు చూసేస్తున్నారు. అలాంటి లిస్ట్ లో మీర్జాపూర్, ఫ్యామిలీ మ్యాన్, సెకర్డ్ గేమ్స్, పాతాళ్ లోక్, పంచాయత్ వంటి సిరీస్లు ఉన్నాయి. వాటిలీ మరీ ముఖ్యంగా పంచాయత్ సిరీస్ కు చాలా మంచి ఆదరణ లభించింది. అందుకే ఈ వెబ్ సరీస్ కి వరుసగా సీజన్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు సీజన్స్ ఈ సిరీస్ నుంచి వచ్చి సూపర్ హిట్టు అయ్యాయి. ఇప్పుడు తాజాగా సీజన్ 3 కూడా వచ్చేసింది. రావడమే కాదండోయ్.. ఓటీటీని దుమ్ము దులుపేస్తోంది. ఇప్పటికీ పంచాయత్ సీరీస్ కి క్రేజ్ తగ్గలేదు అనే విషయం రుజువైంది.

ఈ పంచాయత్ సీజన్ 3లో కూడా దాదాపుగా రెండు సీజన్స్ లో చెప్పిన తరహాలోనే కథ ఉంటుంది. ఈ సీజన్లో ఆ ఊరి నుంచి.. ఆ పంచాయతీ ఉద్యోగం నుంచి హీరో తప్పించుకుని పోవాలని చాలానే ప్రయత్నాలు చేస్తాడు. చివరకి తట్టా బుట్టా సర్దుకుని స్టార్ట్ అవుతాడు కూడా. కానీ, అనుకోని సంఘటనల నడుమ అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ పంచాయతీలో ఎలక్షన్స్ రావడం, అనుకోని విధంగా కొత్త వాళ్లు ఈసారి ఎన్నికల్లో నిల్చోవడం వంటి పరిణామాలు జరుగుతాయి. దాదాపుగా ఈ సీజన్ మొత్తం ఎన్నికల చుట్టూ జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా.. హీరో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అవుతుంది.

ఎందుకు అంత క్రేజ్:

ఈ పంచాయత్ సిరీస్ కు ఎంతో మంచి క్రేజ్ ఉందని తెలుసు. కానీ, ఎందుకు అంత క్రేజ్ అనేది చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచిస్తారు. ముఖ్యంగా ఈ సిరీస్ హిందీలో ఉండటం ప్లస్ పాయింట్. హిందీ ఉండటం వల్ల రీచ్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా.. ఇందులో అంతా న్యాచురల్ కామెడీ ఉంటుంది. అంటే మనం డైలీ లైఫ్ లో ఎలా అయితే ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటామో అలాంటి ఇన్ జనరల్ డైలాగ్స్ ఉంటాయి. అలాగే ఇది గ్రామస్థులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎంత సిటీలో ఉన్నా.. అందరూ పల్లెటూరుకు చెందిన వాళ్లే కాబట్టి ఎక్కువ మంది రిలేట్ అవుతారు. అందుకే అంత క్రేజ్. మరి.. ఈ పంచాయత్ సిరీస్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకా చూడకపోతే ఒకసారి చూసేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişJojobetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet güncel girişmadridbet