iDreamPost

IMDBలో 8.3 రేటింగ్ ఉన్న బెస్ట్ వెబ్ సిరీస్! అస్సలు మిస్ కాకండి!

OTT Suggestions Best Web Series: ఓటీటీలో చాలానే వెబ్ సిరీస్ లు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక ఎమోషనల్, ఇన్ స్పిరేషనల్, మెసేజ్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ మాత్రం చూసి ఉండరు.

OTT Suggestions Best Web Series: ఓటీటీలో చాలానే వెబ్ సిరీస్ లు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక ఎమోషనల్, ఇన్ స్పిరేషనల్, మెసేజ్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ మాత్రం చూసి ఉండరు.

IMDBలో 8.3 రేటింగ్ ఉన్న బెస్ట్ వెబ్ సిరీస్! అస్సలు మిస్ కాకండి!

ఓటీటీలో యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, అడ్వెంచరస్, సూపర్ హీరో వెబ్ సిరీస్లు చూసే ఉంటారు. కానీ, డ్రామా వెబ్ సిరీస్ల జోలికి వెళ్లడానికి చాలామంది జంకుతూ ఉంటారు. అవి స్టార్ట్ చేశాక బోర్ కొడతాయేమో అనే భయం అందరిలో ఉంటుంది. అయితే ఒక మంచి డ్రామా సిరీస్ ని చూస్తే మాత్రం ఆ ఫీల్ వేరే ఉంటుంది. కానీ, చాలామందికి అలాంటి వెబ్ సిరీస్లు దొరక్క.. వాటిని వెతుక్కునే ఓపిక లేగ వదిలేస్తూ ఉంటారు. అలాంటి ఒక గొప్ప వెబ్ సిరీస్ ని మీకోసం ఓటీటీ సజీషన్ గా తీసుకొచ్చాం. ఈ సిరీస్ చూశాక మీరు కచ్చితంగా ఇలాంటి కామెడీ డ్రామా సిరీస్ ల కోసం వెతుకులాట మొదలు పెట్టేస్తారు. మరి.. ఆ వెబ్ సిరీస్ ఏది? అది ఎందుకంత స్పెషలో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటోంది అయలీ అనే వెబ్ సిరీస్ గురించి. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో అందుబాటులో ఉంది. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 33 నిమిషాల నుంచి 36 నిమిషాల వరకు ఉంటుంది. ఇది తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, బెగాలీ భాషల్లో అందుబాటులో ఉంది. నిజానికి విడుదలై ఏడాది కావొస్తున్నా చాలామంది దీనిని లైట్ తీసుకున్నారు. కానీ, ఐఎండీబీలో మాత్రం 8.3 రేటింగ్ వచ్చేసింది. చూసిన వారికి ఇదైతే ఎంతో బాగా నచ్చేసింది. పైగా ఈ వెబ్ సిరీస్ డ్రామా కామెడీ మాత్రమే కాకుండా.. ఇప్పటికీ మన దేశంలో అక్కడక్కడ ఆడపిల్ల చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఆడపిల్ల చదువు నిర్లక్ష్యం చేసే వారికి కనువిప్పు కూడా అవుతుంది. మీరు ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం అనే చెప్పాలి. పైగా ఇందులో కుటుంబం, ఆడపిల్ల చదువు, పుష్పవతి అయ్యాక ఆడపిల్ల జీవితానికి సంబంధించి ఎన్నో ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అవి ఆడియన్స్ ని కంటతడి పెట్టిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమ్మవారి పేరిట కట్టుబాట్లు పెట్టడం, ఆడపిల్లలను చదువుకోకుండా చేయడం వంటి సీన్స్ చూస్తున్నప్పుడు కాస్త కోపం కూడా వస్తుంది. ఈ సిరీస్ కి సంబంధించి డైరెక్టర్ ఎంతో పక్కగా కథ రాసుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించాడు. అంతేకాకుండా యాక్టర్స్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ తో కట్టిపడేస్తారు.

కథ ఏంటంటే?:

కట్టుబాట్ల పేరుతో ఆడపిల్లల చదువును 500 సంవత్సరాలుగా శాసిస్తున్న గ్రామాన్ని ఎదిరించి పోరాడే ఒక అమ్మాయి కథ ఇది. తమిళ్ సెల్వి అనే అమ్మాయి డాక్టర్ కావాలి అని కలలు కంటుంది. కానీ, అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. ఎందుకంటే ఆ ఊరిలో ఏ అమ్మాయి కూడా పదో తరగతి చదవలేదు. ఎందుకంటే పుష్పవతి అయితే అక్కడ వెంటనే పెళ్లి చేసేయాలి. అది 500 ఏళ్లుగా వస్తున్న ఆచారం. అలా పెళ్లి చేయకపోతే అయాలీ దేవత శాపం ఊరుకు తగులుతుంది అనేది వారి మూఢనమ్మకం. అలాంటి ఒక నమ్మకాన్ని ఎదిరించి పోరాడేందుకు తమిళ్ సెల్వి నిర్ణయించుకుంటుంది. కుటుంబంతో కలిసి తాను పుష్పవతి అయ్యాను అనే విషయాన్ని దాచిపెట్టి చదువు కొనసాగిస్తుంది. ఆ ఊరిలో పదో తరగతిలో చేరిన మొదటి అమ్మాయి తమిళ్ సెల్వీనే అవుతుంది. మరి.. ఆమె తన కలను నెరవేర్చుకుందా? అనుకున్నట్లు పదో తరగతి చదివి.. డాక్టర్ అయ్యిందా? అసలు ఆ ఊరు తమిళ్ సెల్వీని, ఆ కుటుంబాన్ని అక్కడ ఉండనిచ్చిందా? సెల్వీ చేసిన పని.. ఆ ఊరిలో అమ్మాయిల తలరాతను మార్చిందా? అనే ప్రశ్నలు తెలియాలంటే జీ5లో అయలీ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి