iDreamPost
android-app
ios-app

బతకడం కోసం ఫ్రెండ్స్ నే చంపుకు తింటూ.. OTTలో బెస్ట్ సర్వైవల్ డ్రామా!

OTT Suggestions- Best Survival Drama: ఓటీటీలో మీరు మంజుమ్మెల్ బాయ్స్ లాంటి సర్వైవల్ డ్రామాలు చూసే ఉంటారు. కానీ, ఇలాంటి ఒక సర్వైవల్ మూవీని మాత్రం చూసి ఉండరు. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే మీకు తెలియకుండా ఏడ్చేస్తారు. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది.

OTT Suggestions- Best Survival Drama: ఓటీటీలో మీరు మంజుమ్మెల్ బాయ్స్ లాంటి సర్వైవల్ డ్రామాలు చూసే ఉంటారు. కానీ, ఇలాంటి ఒక సర్వైవల్ మూవీని మాత్రం చూసి ఉండరు. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే మీకు తెలియకుండా ఏడ్చేస్తారు. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది.

బతకడం కోసం ఫ్రెండ్స్ నే చంపుకు తింటూ.. OTTలో బెస్ట్ సర్వైవల్ డ్రామా!

కొన్నిసార్లు బతకడం కంటే కూడా చావడం చాలా సుఖంగా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు చావు భయం బతకడం ఎలాగో నేర్పిస్తుంది. మీరు ఇప్పటి వరకు చాలానే సర్వేవల్ డ్రామాలు చూసుంటారు. కానీ, ఇది మాత్రం కచ్చితంగా మీ మైండ్ ని షఫుల్ చేస్తుంది. అరె ఇలాంటి సినిమా ఒకటి చూడలేదా అనే ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఇన్నిరోజులు సర్వైవల్ డ్రామా అనగానే మంజుమ్మెల్ బాయ్స్ అనుకుంటూ వస్తున్నారు. కానీ, ఈ సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయం మారిపోతుంది. ఈ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ కి కనీసం 10 రెట్లు ఎక్కువ హై ఇస్తుంది. ఇక్కడ ఆ మూవీ తక్కువ చేయడం కాదు.. కానీ, ఈ మూవీ స్కేల్ పెద్దది అని చెప్తున్నాం.

మీకు సర్వైవల్ డ్రామా ఇష్టమైతే మాత్రం ఈ సినిమా మీకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. ఇందులో ఒక్కో పాత్ర పడే కష్టం మీ కళ్లను చెమ్మగిల్లేలా చేస్తాయి. ఈ సినిమా ఏకంగా నాలుగు ఆస్కార్ నామిమేషన్స్ దక్కించుకుంది. ఈ సినిమా కథ మొత్తం ఎలాగైనా బతకాలి అనే పాయింట్ మీదే నడుస్తూ ఉంటుంది. కొందరు ప్లేయర్లు విమానంలో వెళ్తూ ఉండగా అనుకోని ప్రమాదం జరుగుతుంది. ఆ విమానంలో క్రూతో కలిపి మొత్తం 45 మంది ప్రయాణికులు ఉంటారు. ఆ ప్రమాదం సమయంలో సగం మంది ప్రాణాలు కోల్పోతారు. మొదటి వారం గడిచే సరికి కేవలం 28 మంది మాత్రమే మిగులుతారు. ఇది కల్పితం అనుకోకండి. ఇది నిజంగా జరిగిన కథే.

అవును.. మీరు చదివింది నిజమే. ఇది నిజంగా జరిగిన కథ. ఆ కథ ఆధారంగానే ఈ సినిమాని నిర్మించారు. ఆ విమాన ప్రమాదం 1971లో జరిగింది. ఒక రగ్బీ టీమ్ ఆ విమానంలో ప్రయాణించింది. ఎంతో ఆనందంగా ప్రయాణం చేస్తున్న వారి విమానం ఒక్కసారిగా మంచు పర్వతాల్లో కూలిపోతుంది. ఎంతో అనుభవం ఉన్న పైలట్ కూడా దానిని ఆపలేకపోతాడు. ఆ తర్వాత విమానం తునాతునకలు అయిపోతుంది. ఆ సమయంలో వారి వద్ద సరైన బట్టలు కూడా ఉండవు. ఆ మంచుని తట్టుకోవడానికి వారి వద్ద ఏమీ ఉండదు. కానీ, బతకాలి, తిరిగి సొంతవారిని చూడాలి అనే ఒక తాపత్రయం తప్ప.

ఈ కథ ఆసాంతం మిమ్మల్ని ఎంతో ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే బతకడం కోసం మన ప్రాణ మిత్రుడి శవాన్ని పీక్కు తినడం అంటే అది ఊహించుకోవడానికి ఎంతో కష్టంగా ఉంటుంది. కానీ, ఏది చేసైనా వాళ్లు బతకాలి. అది వాళ్లంతా చేసి చూపించారు. ఏకంగా 16 మంది కలిసి కట్టుగా పనిచేసి ఆ విపత్కర పరిస్థితి నుంచి బతికి బట్టకడతారు. ఈ సినిమా మీకు కన్నీళ్లు తెప్పించడం ఖాయం. అయితే చిన్న పిల్లలతో ఈ మూవీ చూడకపోతేనే మంచిది. కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కూడా కలచి వేయచ్చు. ఈ సినిమా పేరు సొసైటీ ఆఫ్ ది స్నో. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి