iDreamPost

కుర్రాడిని ముగ్గులోకి దించే ఉద్యోగం.. OTTలో ఉన్న బెస్ట్ రొ*మాంటిక్ మూవీ!

OTT Suggestions- Best Romantic Movie: ఓటీటీలో మీరు ఎన్నో సినిమాలు చూసి ఉంటారు. కానీ, కొన్ని కొన్ని జానర్స్ లో మాత్రం మంచి సినిమాలు ఏవో తెలియక లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ, ఇది మాత్రం బెస్ట్ బో*ల్డ్ మూవీ.

OTT Suggestions- Best Romantic Movie: ఓటీటీలో మీరు ఎన్నో సినిమాలు చూసి ఉంటారు. కానీ, కొన్ని కొన్ని జానర్స్ లో మాత్రం మంచి సినిమాలు ఏవో తెలియక లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ, ఇది మాత్రం బెస్ట్ బో*ల్డ్ మూవీ.

కుర్రాడిని ముగ్గులోకి దించే ఉద్యోగం.. OTTలో ఉన్న బెస్ట్ రొ*మాంటిక్ మూవీ!

ఇప్పుడు ఒక్కొక్కరికి మూడు, నాలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ సబ్ స్క్రిప్షన్స్ ఉంటున్నాయి. వాటిలో యాక్షన్, డ్రామా, కామెడీ, సస్పెన్స్, హారర్ అంటూ ఒక్కో జానర్ ని వదలకుండా చూసేస్తున్నారు. అయితే చాలామంది ఒక కేటగిరీని టచ్ చేయాలంటే మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. కొందరు భయంతో, ఇంకొందరు మంచి మూవీస్ ఏం ఉంటాయిలే అనే ఆలోచనతో ఆ జానర్ జోలుకి వెళ్లరు. అది మరేదో కాదు.. రొ*మాంటిక్ మూవీస్. అవును చాలా మంది ఈ జానర్ జోలికి వెళ్లరు. కానీ, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఈ జానర్ లో లెక్కలేనన్ని అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు చెప్పుకునే సినిమా కూడా ఒకటి.

మనదేశంలో పిల్లల పెంపకానికి.. విదేశాల్లో పిల్లలు పెంచే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడినా.. అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడిన కాస్త కంగారు పడుతూ ఉంటాం. ఎందుకంటే మన కల్చర్, మన సంస్కృతి వేరు. కానీ, విదేశాల్లో వారి జీవన విధానం, పిల్లల పెంపకం వాటికి భిన్నంగా ఉంటుంది. అక్కడ 18 ఏళ్లు దాటిన తర్వాత వారి కంటూ లైఫ్ ని లీడ్ చేయాల్సి ఉంటుంది. అందరితో కలుపుగోలు తనంగా ఉండాలి. సమాజం అంటే ఏంటో తెలుసుకోవాలి. అబ్బాయి అయితే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి? సోషల్ లైఫ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ మూవీలో అదే విషయాన్ని స్పష్టంగా చెప్తారు.

ఈ మూవీలో ఓ కుర్రాడు ఉంటాడు. అతనికి సోషల్ లైఫ్ అంటే ఏంటో తెలియదు. అమ్మాయిలతో మాట్లాడడు. డేటింగ్ కి వెళ్లడు. అసలు అతని గదిలో నుంచి అడుగు బయట పెట్టడు. అలాంటి కుర్రాడిని మంచిగా మార్చాలని వాళ్ల వాళ్లు అనుకుంటారు. అతడిని అందరిలా జనాల్లో ఒకడిగా బతికేలా చేయాలి అని తాపత్రయ పడతారు. అందుకోసం ఒక డిఫరెంట్ ఆఫర్ చేస్తారు. తమ పిల్లాడిని డేటింగ్ చేస్తే కారు వాడుకునేందుకు వెసులుబాటు ఇస్తామని చెప్పారు. మరోవైపు హీరోయిన్ జెన్నిఫర్ లారెన్స్ వద్ద ఉన్న కారును తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తీసేసుకుంటాడు.

ఆమె నచ్చిన వాళ్లతో రొ*మ్యాన్స్ చేస్తూ ఉంటుంది. కానీ, ఆమె జాబ్ కోసం కారు కచ్చితంగా కావాలి. అందుకే ఆ కుర్రాడని డేటింగ్ చేసే ఉద్యోగానికి ఓకే చెప్తుంది. అతడికి అసలు బయట ప్రపంచం ఎలా ఉంటుంది? నలుగురితో ఎలా మెలగాలి. ముఖ్యంగా అమ్మాయిలతో ఎలా ఉండాలి అనే విషయాలను నేర్పిస్తుంది. ఈ క్రమంలో చాలానే ఘాటు సన్నివేశాలు, కామెడీ సీన్స్ ఉంటాయి. మూవీ మొత్తం కాస్త ఘాటు ఘాటుగానే ఉంటుంది. కాబట్టి ఒంటరిగా చూస్తే కాస్త బెటర్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు “నో హార్డ్ ఫీలింగ్స్“. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి