iDreamPost
android-app
ios-app

ఇండియాలోనే టాప్ రొమాం*టిక్ సిరీస్.. ఒక్కో సీన్ హీట్ పెంచేస్తుంది!

OTT Suggestions- Best Romatic Drama Series: ఓటీటీల్లో మీరు ఇప్పటివరకు చాలానే వెబ్ సిరీస్లు చూసుంటారు. కానీ, ఎప్పుడైనా రొమాం*టిక్ డ్రామా చూశారా? ఈ సిరీస్ చూసిన తర్వాత మీకు ఆ కేటగిరీలో కూడా ఆసక్తి పెరిగిపోతుంది.

OTT Suggestions- Best Romatic Drama Series: ఓటీటీల్లో మీరు ఇప్పటివరకు చాలానే వెబ్ సిరీస్లు చూసుంటారు. కానీ, ఎప్పుడైనా రొమాం*టిక్ డ్రామా చూశారా? ఈ సిరీస్ చూసిన తర్వాత మీకు ఆ కేటగిరీలో కూడా ఆసక్తి పెరిగిపోతుంది.

ఇండియాలోనే టాప్  రొమాం*టిక్ సిరీస్.. ఒక్కో సీన్ హీట్ పెంచేస్తుంది!

ఓటీటీల్లో వెబ్ సిరీస్లు చూసే వాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇండియాలో కూడా వెబ్ సిరీస్ లు ఇష్టపడే వాళ్లు బాగా పెరిగిపోయారు. ముఖ్యంగా తెలుగులో కూడా వెబ్ సిరీస్లకు మంచి డిమాండ్ పెరిగింది. అందుకే నేరుగా తెలుగులోనే మంచి మంచి వెబ్ సిరీస్లను నిర్మిస్తున్నారు. అయితే మీరు ఇప్పటివరకు యాక్షన్, డ్రామా, కామెడీ సిరీస్లు చూసుంటారు. కానీ, రొమాం*టిక్ డ్రామా వెబ్ సిరీస్ ని చూశారా? అది కూడూ ఓ రేంజ్ లో ఉండే డ్రామా ఇది. కాలేజ్ స్టూడెంట్స్ మధ్య జరిగే ఒక ఎమోషనల్, లవ్, యాక్షన్, రొమాం*టిక్ డ్రామా ఇది. ఇప్పుడు ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ లో ఉంది. మరి.. ఆ సిరీస్ ఏది? ఎందుకు అంత ట్రెండ్ అవుతుందో చూద్దాం.

ఇంత హైప్ ఇస్తున్న వెబ్ సిరీస్ పేరు ‘మ్యాక్స్ టన్ హాల్’. ఈ వెబ్ సిరీస్ ఇండియాలోనే టాప్ 5లో ట్రెండ్ అవుతోంది. విడుదలకు ముందే ఈ సిరీస్ ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశారు. ఈ సిరీస్ మీద ఎందుకు అంత హైప్ వచ్చింది అంటే.. ఈ సిరీస్ లో ఒక మంచి కాన్ ఫ్లిక్ట్ పెట్టారు. అందేంటంటే.. డబ్బు VS పేదరికం. ఇప్పటికే మీరు తెలుగులో చాలానే సినిమాలు, సిరీస్లు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక సిరీస్ ని మాత్రం చూసుండరు. ఎందుకంటే విద్యార్థుల మధ్య ఇన్ని కుట్రలు, కుతంత్రాలు, అంత గర్వం, పొగరు చూసుండరు. డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకునే కుర్రాడు ఒకవైపు.. చదువే సర్వస్వంగా బతికే అమ్మాయి మరోవైపు. విధి వాళ్లిద్దరను దగ్గరకు చేస్తే ఏం జరుగుతుంది? అనేదే పాయింట్.

ఈ మ్యాక్స్ టన్ హాల్ అనేది ఒక కాలేజ్. అయితే అక్కడ అందరూ బిలియనీర్లే చదువుతూ ఉంటారు. ఒక్కొక్కళ్లు కోట్లు ఖరీదు చేసే కార్లలో కాలేజ్ కి వస్తుంటారు. కానీ, హీరోయిన్ పరిస్థితి పూర్తిగా భిన్నం. ఆమె స్కాలర్ షిప్ మీద ఆ కాలేజ్ లో చదువుకునేందుకు వెళ్తుంది. అయితే అక్కడ ఉన్న కోటీశ్వరుల పిల్లలు మాత్రం ఆ అమ్మాయిన కనీసం మనిషిగా కూడా చూడరు. అయితే హీరో కన్ను ఆ అమ్మాయి మీద పడుతుంది. తన కోరిక తీర్చుకునేందుకు ఆమెను లొంగ*దీసుకోవాలి అని ప్రయత్నిస్తాడు. అందుకు ఆమెకు డబ్బు ఆశ చూపిస్తాడు. కానీ, ఆత్మ గౌరవం కలిగిన ఆ యువతి ఆ డబ్బును హీరో ముఖం మీద విసిరికొడుతుంది.

ఆ యువతిని ఎలాగైనా లొంగ*దీసుకోవాలని హీరో నిశ్చయానికి వస్తాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయితో హీరో కోరిక తీర్చుకోవాలని చూశాడా? లేక నిజంగానే ప్రేమలో పడిపోయాడా? ఆ అమ్మాయి ఆ పొగరుబోతు హీరోని దగ్గరకు రానిస్తుందా? అసలు ఆ బిలీయనీర్ల కాలేజ్ లో ఏం జరుగుతుంది? అనే ఇంట్రస్టింగ్ పాయింట్లతో ఈ వెబ్ సిరీస్ సాగుతూ ఉంటుంది. ఈ ట్రెండింగ్ జర్మన్ వెబ్ సిరీస్ మీకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ని మీరు తెలుగులో కూడా చూడచ్చు. మరి.. మ్యాక్స్ టన్ హాలు వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişEnbet Girişivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş