iDreamPost

రియల్ క్రైమ్ స్టోరీ ఆధారంగా ఇన్వెస్టిగేటివ్ సిరీస్.. వెన్నులో వణుకు పుడుతుంది!

OTT Suggestions- Best Investigative Web Series: ఓటీటీలో మీరు ఇప్పటివరకు చాలానే క్రైమ్ స్టోరీస్ చూసుంటారు. కానీ, ఎప్పుడైనా యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఒక ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్ చూశారా?

OTT Suggestions- Best Investigative Web Series: ఓటీటీలో మీరు ఇప్పటివరకు చాలానే క్రైమ్ స్టోరీస్ చూసుంటారు. కానీ, ఎప్పుడైనా యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఒక ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్ చూశారా?

రియల్ క్రైమ్ స్టోరీ ఆధారంగా ఇన్వెస్టిగేటివ్ సిరీస్.. వెన్నులో వణుకు పుడుతుంది!

మీకు క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమా? అయితే మీరు ఇలాంటి ఒక రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన ఒక వెబ్ సిరీస్ ని చూశారా? అలాంటి సిరీస్లు కొన్ని ఓటీటీల్లో అందుబాటులోనే ఉన్నాయి. కానీ, ఇలాంటి ఒక యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ని మాత్రం మీరు చూసి ఉండరు. పైగా ఇది సినిమా కాదు.. వెబ్ సిరీస్. ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తే ఆపడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్, ప్రతి సీన్ మిమ్మల్ని కట్టి పడేస్తుంది. ఎక్కడా కూడా స్కిప్ చేసేందుకు మీకు మనసలు రాదు. పేరుకు బాలీవుడ్ సిరీస్ అయినా కూడా తెలుగులోనే అందుబాటులో ఉంది.

మీకు క్రైమ్ సిరీస్లు చూసే అలవాటు ఉంటే మాత్రం ఈ సిరీస్ ని అస్సలు వదలొద్దు. ఓటీటీలో ఇది ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్. ఇన్వెస్టిగేషన్ ప్యాట్రన్ లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. కాకపోతే వెబ్ సిరీస్ అయ్యే సరికి అందరూ దీనిని లైట్ తీసుకున్నారు. కానీ, అండర్ రేటెడ్ బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. సామాన్యంగా ఇలాంటి సినిమాలు అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ, వెబ్ సిరీస్ అనే సరికి కాస్త వెనుకాడుతూ ఉంటారు. అయితే ఈ వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం కూడా. అందుకే వీకెండ్స్ దీనిని మీరు చూడటం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అసలు ఆ సిరీస్ ఏంటి? ఎందుకంత హైప్ అనేది చూద్దాం.

ఈ సిరీస్ మొత్తం ఒక స్కూల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది సామాన్యమైన పిల్లలు వెళ్లే స్కూల్ కాదు. అది ఒక హై ప్రొఫైల్ వ్యక్తుల పిల్లలు చదివే పాఠశాల. అక్కడ చదువుకునే పిల్లలు అందరూ సమాజంలో హోదా, పెద్ద స్థానం ఉన్న వాళ్ల పిల్లలే. అలాంటి పిల్లల్లోంచి ఒక విద్యార్థి మాయమవుతాడు. అసలు అతను ఏమయ్యాడో కూడా ఎవరికీ తెలియదు. అతను అదృశ్యమయ్యాక స్కూల్ మొత్తం అలర్ట్ అవుతుంది. కానీ, ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాలి అని చూస్తారు. కానీ, ఆ విద్యార్థిని కనిపెట్టడంలో వాళ్లు విఫలమవుతారు. విద్యార్థికి తల్లికి అసలు విషయం తెలుస్తుంది. ఆమె వచ్చి స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయడంతో పోలీసులకు విషయాన్ని చెప్తారు.

ఈ సిరీస్ మొత్తం ఆ విద్యార్థి అదృశ్యమయ్యాక అతని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. అసలు అతను ఎలాంటి వాడు? అందరితో ఎలా ఉండేవాడు? అసలు ఎలా కనిపించకుండా పోయాడు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు మీరు ఈ సిరీస్లో చూడచ్చు. ఈ సిరీస్ పేరు ‘ది స్కూల్ ఆఫ్ లైస్’. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 30 నుంచి 40 నిమిషాల నిడివి ఉంటుంది. మరి.. ఈ వెబ్ సిరీస్ గనుక మీరు చూసుంటే.. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి