iDreamPost

OTT Premiers On 4th March : డిజిటల్ ఆడియన్స్ కి ఎన్ని ఆప్షన్లో

OTT Premiers On 4th March : డిజిటల్ ఆడియన్స్ కి ఎన్ని ఆప్షన్లో

గతంలో చెప్పుకున్నట్టే ఇకపై థియేట్రికల్ బాక్సాఫీస్ కు ధీటుగా ప్రతి శుక్రవారం ఓటిటి ఎంటర్ టైన్మెంట్ రెడీ అవుతోంది. ఇంటి నుంచి బయటికి వెళ్లే అవసరం లేకుండా రకరకాల ఆప్షన్లతో వివిధ భాషల్లో వినోదాన్ని అందించేందుకు డిజిటల్ సంస్థలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగా మార్చి 4న రాబోయే కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. లేటెస్ట్ సెన్సేషన్ ‘డీజే టిల్లు’ ఆహాలో ఇవాళ అర్ధరాత్రి 12 నుంచి అందుబాటులోకి రానుంది. హాళ్లలోనే భారీ వసూళ్లు దక్కించుకున్న ఈ కామెడీ కం క్రైమ్ థ్రిల్లర్ ని చూడని వాళ్ళు భారీగా ఉన్నారు. సో ఆహాకు కొంచెం గ్యాప్ తర్వాత జాక్ పాట్ పడినట్టే. రెండు మూడు వారాలుగా అందులో సరైన రిలీజ్ లేదు.

విశాల్ నటించిన ‘సామాన్యుడు’ జీ5లో పలకరించబోతున్నాడు. డిజాస్టర్ ఫలితమే అయినప్పటికీ మిస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వ్యూస్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. అజయ్ దేవగన్ నటించిన మొదటి వెబ్ సిరీస్ ‘రుద్ర’ డిస్నీ హాట్ స్టార్ లో వస్తోంది. ఇందులో రాశి ఖన్నా నటించడం విశేషం. తెలుగుతో కలిపి మొత్తం ఏడు భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నారు. సో వీక్షకులు రికార్డులు ఇస్తారేమో. ఫస్ట్ లాక్ డౌన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న ‘అన్ దేఖీ 2’ సోనీ లివ్ ద్వారా రానుంది. ఇది కూడా రుద్ర టైప్ లో మల్టీ లాంగ్వేజ్ లో డబ్బింగ్ చేసుకుంది. బాండ్ చిత్రం ‘నో టైం టు డై’ ప్రైమ్ ద్వారా అన్ని భారతీయ భాషల్లో వస్తోంది.

ఇవి కాకుండా ఇంగ్లీష్ సిరీస్ లు పీసెస్ అఫ్ హర్, మేకింగ్ ఫన్, గ్రేస్ అనాటమీ, సింగల్ డ్రంక్ ఫిమేల్ వెబ్ సిరీస్ లు స్మార్ట్ స్క్రీన్ కోసం ముస్తాబయ్యాయి. కన్నడలో ఓబ్బా, తమిళంలో రమనీ vs రమనిలు చెప్పుకోదగ్గ అంచనాలుతో రిలీజ్ అవుతున్నాయి. అన్నీ చూడాలంటే అంత సులభం కాదు కానీ ప్రేక్షకుల తమ తమ టేస్ట్ ని బట్టి బాషను బట్టి ఎంచుకునే ఆప్షన్లైతే పుష్కలంగా ఉన్నాయి. థియేటర్లలో రేపు ఆడవాళ్ళూ మీకు జోహార్లు, సెబాస్టియన్, బ్యాట్ మ్యాన్, ఝున్డ్ వస్తున్న తరుణంలో ఇవేవి చూడలేని పరిస్థితిలో ఉంటే మాత్రం హ్యాపీగా పైన చెప్పిన వాటితో కావాల్సినంత టైం పాస్ ని కదలకుండా అందుకోవచ్చు.

Also Read : Hey Sinamika Report : హే సినామిక రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి