iDreamPost

2022 రివ్యూ 1 – అదరగొట్టిన పాటలు

2022 రివ్యూ 1 – అదరగొట్టిన పాటలు

2022 ఇంకో పది రోజుల్లో సెలవు తీసుకోబోతోంది. ఎన్నో జ్ఞాపకాలు అటు ఇండస్ట్రీకి అటు ప్రేక్షకులకు కలిపి పంచింది. ఒకొక్కటిగా వాటిని రివైండ్ చేస్తూ కొత్త సంవత్సరం 2023కి స్వాగతం చెబుదాం. ముందుగా ఆడియన్స్ ని ఊపేసిన పాటలేంటో ఓ లుక్ వేద్దాం. తెలుగు జనాలకే కాదు యావత్ ప్రపంచాన్ని ఊపేసిన ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ని మించిన బెస్ట్ డ్యాన్సింగ్ నెంబర్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. దేశవిదేశాల్లోని మ్యూజిక్ లవర్స్ ని మెప్పించేసింది. పెద్దగా అంచనాలు లేకపోయినా యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ‘డీజే టిల్లు టైటిల్’ సాంగ్ మాములు వైరల్ అవ్వలేదు. ఏ ఫంక్షన్ కు వెళ్లినా ఇది లేనిదే బ్యాండ్ లేదనేంత రేంజ్ లో పాకింది

మహేష్ బాబు సర్కారు వారి పాటలో ‘కమాన్ కళావతి’ ఏకంగా రెండు వందల మిలియన్లకు పైగా వ్యూస్ తో సినిమా యావరేజ్ అయినా పాట మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. రామ్ డిజాస్టర్ మూవీ వారియర్ లో ‘బుల్లెట్’ సాంగ్ రీచ్ చిన్నది కాదు. డబ్బింగ్ మూవీ విక్రాంత్ రోనాలో ‘రారా రక్కమ్మా’ ఎక్కడ చూసినా మారుమ్రోగిపోయింది. నాగార్జున చైతుల బంగార్రాజులో ‘బంగారా బుల్లెట్ ఎక్కి వచ్చెయ్ రా’ మొత్తం ఆల్బమ్ లోని సూపర్ హిట్ పాట. ఖిలాడీ ‘అట్టా సూడకే’, రౌడీ బాయ్స్ ‘బృందావనంలో కృష్ణుడు వచ్చాడే’కి అనుపమ పరమేశ్వరన్ స్టెప్స్ భారీ వ్యూస్ తెచ్చుకున్నాయి. సీతారామంలో ‘ఓ సీతా’ , ‘ఇంతందం’ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకునేందుకు పోటీ పడ్డాయి

విజయ్ బీస్ట్ ‘అలమతి అబిబో’ గురించి చెప్పేదేముంది. సినిమా బాగోకపోయినా ఈ వీడియోని పదే పదే చూసినవాళ్లు ఉన్నారు. విశ్వక్ సేన్ ఓరి దేవుడాలో ‘గుండెల్లోనా గుండెల్లోనా’లో అనిరుద్ గాత్రానికి మైమరిచిపోనివాళ్ళు లేరు. మాచర్ల నియోజకవర్గంలో ఐటెం సాంగ్ ‘రారా రెడ్డి’ మాస్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ధనుష్ తిరులో ‘నామది పూవది’ ఎందరో ప్రేమికులకు హమ్మింగ్ గా మారిపోయింది. గాడ్ ఫాదర్ లో చిరు సల్మాన్ కలిసి ఆడిపాడిన ‘తార్ మార్ తక్కర్ మార్’ హిందీలో మార్కెట్ ని తీసుకొచ్చింది. రవితేజ శ్రీలీల ధమాకాలో ‘జింతాక జింతాక్’ ది అభిమానులకే కాదు బీట్స్ ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఫేవరెట్ గా మారిపోయింది. బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా ఈ పాత్రలు ప్రధానంగా ఛార్ట్ బస్టర్స్ గా నిలిచాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి