iDreamPost
android-app
ios-app

OTT Release: ఈ వారం OTT ల్లోకి 18 సినిమాలు.. ఆ 3 మాత్రం ప్రత్యేకం

  • Published Apr 15, 2024 | 8:12 AM Updated Updated Apr 15, 2024 | 8:12 AM

మరో కొత్త వారం వచ్చేసింది.. ఓటీటీల్లోకి రాబోయే సినిమాల వివరాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏవంటే..

మరో కొత్త వారం వచ్చేసింది.. ఓటీటీల్లోకి రాబోయే సినిమాల వివరాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏవంటే..

  • Published Apr 15, 2024 | 8:12 AMUpdated Apr 15, 2024 | 8:12 AM
OTT Release: ఈ వారం OTT ల్లోకి 18 సినిమాలు.. ఆ 3 మాత్రం ప్రత్యేకం

ఓటీటీలకు క్రేజ్ పెరిగిన తర్వాత.. మూవీ లవర్స్ పండగ చేసుకుంటున్నారు. భాషతో సంబంధం లేకుండా.. వరుస పెట్టి సినిమాలు ఆస్వాదిస్తున్నారు. ఇక వీకెండ్ వస్తే చాలు.. ఎంచక్కా ఇంట్లో కూర్చునే మూవీలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీల్లో సినిమాలు చూసే వారి సంఖ్య పెరగడంతో.. ఆయా ప్లాట్ ఫామ్ లు కూడా ప్రతి వారం తమ వినియోగదారుల కోసం కొత్త సినిమాలు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకప్పుడు శుక్రవారం నాడు రిలీజ్ అయ్యే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఇప్పుడు వారం వారం ఓటీటల్లోకి వచ్చే కొత్త సినిమాల కోసం అంతే ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఈ వారం ప్రారంభంలోనే మూవీ లవర్స్ కి పండగ లాంటి వార్త మోసుకొచ్చాయి ఓటీటీ ప్లాట్ ఫామ్ లు. ఈ వీక్ లో 18 సినిమాలు ఓటీటీల్లో విడుదలయ్యేందుకు రెడీ అయ్యాయి. ఇక ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా భారీగానే ఉన్నాయి. అర డజనుకుగా పైగా కొత్త సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాలేం లేవు. దీంతో ఆటోమేటిక్ గా అందరి చూపు ఓటీటీలపై పడింది. అందుకు తగ్గట్లే ఈ వారం 18 వరకు కొత్త చిత్రాలు, సిరీస్ లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

ఈ వారం ఓటీటీల్లో విడుదల అయ్యే చిత్రాల్లో మూడు సినిమాల కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అవేంటి అంటే సైరన్, ఆర్టికల్ 370, డ్యూన్ పార్ట్ 2 సినిమాలపై ఆసక్తి నెలకొని ఉంది. వీటితో పాటు పలు ఇంగ్లీష్, హిందీ చిత్రాలైతే ఉన్నాయి గానీ వస్తే గానీ వాటి సంగతి తెలియదు. వీకెండ్ వచ్చే సరికి కొన్ని సినిమాలు సడెన్ గా ఓటీటీల్లో దర్శనం ఇస్తాయేమో చూడాలి.

ఇక ఈ వారం ఓటీటీ రిలీజ్ సినిమాలు-సిరీస్ లు

నెట్ ఫ్లిక్స్

  • ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) – ఏప్రిల్ 15
  • అవర్ లివింగ్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 17
  • ద గ్రిమ్ వేరియేషన్స్ (జపనీస్ సిరీస్) – ఏప్రిల్ 17
  • రెబల్ మూన్: పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 19

హాట్ స్టార్

  • సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ (స్పానిష్ సిరీస్) – ఏప్రిల్ 17
  • ద సీక్రెట్ స్కోర్ (స్పానిష్ సిరీస్) – ఏప్రిల్ 17
  • చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ సిరీస్) – ఏప్రిల్ 19
  • సైరన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) – ఏప్రిల్ 19

జియో సినిమా

  • ద సింపథైజర్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 15
  • ఆర్టికల్ 370 (హిందీ మూవీ) – ఏప్రిల్ 19
  • ఒర్లాండో బ్లూమ్: టూ ద ఎడ్జ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 19

బుక్ మై షో

  • డ్యూన్ పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 16

లయన్స్ గేట్ ప్లే

  • డ్రీమ్ సినారియో (ఇంగ్లీష్ సినిమా) – ఏప్రిల్ 19
  • ద టూరిస్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 19

సోనీ లివ్

  • క్విజ్జర్ ఆఫ్ ద ఇయర్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 15

జీ5

  • సైలెన్స్ 2: ద నైట్ ఔల్ బార్ షూటౌట్ (హిందీ మూవీ) – ఏప్రిల్ 16
  • కమ్ చాలు హై (హిందీ సినిమా) – ఏప్రిల్ 19
  • డిమోన్స్ (హిందీ చిత్రం) – ఏప్రిల్ 19

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş