iDreamPost

2 OTTల్లో రెండ్రోజుల్లో 14 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ మూడింటిపైనే ఆసక్తి

  • Published Mar 01, 2024 | 3:37 PMUpdated Mar 01, 2024 | 3:37 PM

వీకెండ్‌ వచ్చేసిందంటే.. చాలు ఏ ఓటీటీలో ఏ సినిమాలు, సిరీస్‌లు రిలీజ్‌ అవుతున్నాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు సినీ లవర్స్‌. ఇక ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు మీ కోసం. అయితే ఇవి అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతున్నాయి. ఆ వివరాలు..

వీకెండ్‌ వచ్చేసిందంటే.. చాలు ఏ ఓటీటీలో ఏ సినిమాలు, సిరీస్‌లు రిలీజ్‌ అవుతున్నాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు సినీ లవర్స్‌. ఇక ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు మీ కోసం. అయితే ఇవి అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతున్నాయి. ఆ వివరాలు..

  • Published Mar 01, 2024 | 3:37 PMUpdated Mar 01, 2024 | 3:37 PM
2 OTTల్లో రెండ్రోజుల్లో 14 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ మూడింటిపైనే ఆసక్తి

ఈమధ్యకాలంలో ఓటీటీల్లో సినిమాలు చూసేవారు పెరిగిపోతున్నారు. వీకెండ్‌ వచ్చిందంటే చాలు.. ఓటీటీల్లో నచ్చిన మూవీలు పెట్టుకుని.. కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు. దీని వల్ల ఫ్యామిలీతో సమయం కేటాయించినట్లు ఉండటమే కాక కుటుంబంతో కలిసి కొత్త సినిమాలు చూశాము అని ఫీలవ్వచ్చు. ఓటీటీలకు క్రేజ్‌ పెరుగుతుండటంతో.. అవి కూడా ప్రేక్షకుల కోసం కొత్త కంటెంట్‌ను తీసుకువస్తున్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు, సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి.. వారిని ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇంతకుముందు శుక్రవారం అంటే కొత్త సినిమాల రిలీజ్‌ కోసం ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఓటీటీల్లో విడుదలయ్యే మూవీలపై ఆసక్తి చూపుతున్నారు జనాలు.

మూవీ లవర్స్‌ ఆత్రుతగా ఎదురు చూసే వీకెండ్‌ వచ్చేసింది. ఓటీటీల్లో సందడి చేయబోయే కొత్త సినిమాల కోసం వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈవారం థియేటర్లలో భారీ, చిన్న బడ్జెట్‌ సినిమాలు విడుదల కాగా.. ఓటీటీల్లో మాత్రం తమిళ డబ్బింగ్‌, డాక్యుమెంటరీ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఇక ఈ వీకెండ్‌లో రెండు ఓటీటీల్లో 14 సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నాయి. వాటిల్లో మూడింటిపైనే అందరి చూపు ఉంది. ఇంతకు ఏ ఓటీటీల్లో.. ఏఏ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమ్‌ అవుతున్నాయి అంటే..

అమెజాన్‌ ప్రైమ్‌ మీడియా..

  1. బ్లూ స్టార్ (తమిళ మూవీ)- ఫిబ్రవరి 29 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  2. పా పాట్రోల్: ది మైటీ మూవీ (ఇంగ్లీష్ మూవీ)- ఫిబ్రవరి 29 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  3. రెడ్ క్వీన్ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 29 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  4. నైట్ స్విమ్ (ఇంగ్లీష్‌ సినిమా)- మార్చి 1 (ఆల్రెడీ స్ట్రీమింగ్)

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

  1. మన్ సూయాంగ్ (థాయ్ చిత్రం)- ఫిబ్రవరి 29
  2. ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 29
  3. ఫ్యూరిస్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 29
  4. ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ డాక్యుమెంటరీ-4 ఎపిసోడ్స్)- మార్చి 1
  5. మామ్లా లీగల్ హై (హిందీ, తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)- మార్చి 1
  6. మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ (కొరియన్ వెబ్ సిరీస్)- మార్చి 1
  7. షేక్, ర్యాటెల్ అండ్ రోల్: ఎక్స్‌ట్రీమ్ (తగలాగ్ చిత్రం)- మార్చి 1
  8. సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 1
  9. స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 1
  10. ది పిగ్ ది స్నేక్ అండ్ ది పిజియన్ (మాండరిన్ సినిమా)- మార్చి 1
  11. ది నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ చిత్రం)- మార్చి 03

ఇలా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ రెండు ఓటీటీ ప్లాట్‌ఫాముల్లో కలిపి రెండ్రోజుల్లో మొత్తంగా 14 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఫిబ్రవరి 29న 6, మార్చి 1న 8 సినిమాలు స్ట్రీమింగ్‌కు అవుతున్నాయి. అంటే ఎక్కువగా ఇవాళ అంటే శుక్రవారం (మార్చి 1) నాడు ఎక్కువ సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల అయ్యాయి. వీటిలో ఇంద్రానీ ముఖర్జీ స్టోరీ, మామ్లా లీగల్ హై, క్రికెట్ నేపథ్యంలో వచ్చిన బ్లూ స్టార్ పై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి