iDreamPost

ఆర్మీ బేస్ లో రాక్షసుడు.. జవాన్ల ప్రాణాలతో.. OTTలో ఈ మూవీ వణికిపోతారు!

  • Published Jun 17, 2024 | 3:38 PMUpdated Jun 17, 2024 | 3:38 PM

OTT Best Suspense Thriller : హార్రర్ సినిమాలంటే అందరికి ఇష్టమే.. ఇంకా హర్రర్ వెబ్ సిరీస్ గురించైతే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ హర్రర్ సిరీస్ గురించే. మరి ఈ సిరీస్ ఏంటో.. దీనిని మీర్ చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Suspense Thriller : హార్రర్ సినిమాలంటే అందరికి ఇష్టమే.. ఇంకా హర్రర్ వెబ్ సిరీస్ గురించైతే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ హర్రర్ సిరీస్ గురించే. మరి ఈ సిరీస్ ఏంటో.. దీనిని మీర్ చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 17, 2024 | 3:38 PMUpdated Jun 17, 2024 | 3:38 PM
ఆర్మీ బేస్ లో రాక్షసుడు.. జవాన్ల ప్రాణాలతో.. OTTలో ఈ మూవీ వణికిపోతారు!

కొన్ని వెబ్ సిరీస్ లను చూస్తున్నంత సేపు.. వేరే ప్రపంచానికి వెళ్ళిపోతూ ఉంటాము. ఆ రేంజ్ మేక్ ఓవర్స్ తో ప్రేక్షకులకు కిక్ ఎక్కిస్తూ ఉంటారు మేకర్స్. హర్రర్ సినిమాలంటే ఎంత ఇష్టమో.. హర్రర్ సిరీస్ లను కూడా అదే రేంజ్ లో ఇష్టపడుతూ ఉంటున్నారు. వీటిలో కొన్ని సిరీస్ లైతే అందరికి ఎప్పటికి ప్రత్యేకమే. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను చూస్తే మాత్రం కొన్ని హాలీవుడ్ చిత్రాలను మిక్స్ చేసి చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇన్సిండిస్, కంజురింగ్ లాంటి సినిమాలు ఖచ్చితంగా గుర్తొచ్చేస్తాయి. ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ ను చూడకపోతే మాత్రం ఓ మంచి హర్రర్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ వెబ్ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

నటి రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాధికా ఆప్టే మెయిన్ లీడ్ లో నటించిన ఈ సిరీస్ పేరు “గూల్”. ఇన్సిడియస్, గెట్అవుట్, ఉడ్తా పంజాబ్ లాంటి ఎన్నో డిఫ్ఫరెంట్ సినిమాలను తీసిన అదే టీమ్ ఈ సిరీస్ ను కూడా తెరకెక్కించింది. ఈ సిరీస్ హిందీతో పాటు. తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 2018లో వచ్చిన ఈ సిరీస్ కు ఆ సమయంలో భారీ స్పందన లభించింది. ఈ సిరీస్ ను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. లేదంటే ఓ మంచి హర్రర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ ను మిస్ చేసినట్లే. ఈ సిరీస్ మొత్తం మూడు ఎపిసోడ్స్ గా ఉంది .

Ghoul

ఈ సిరీస్ అంతా కూడా మిలిటరీ బ్యాక్గ్రౌండ్ లో కొనసాగుతూ ఉంటుంది. ఆ ప్రాంతంలో మిలటరీ రూల్స్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కనుక.. వారిని దేశ ద్రోహులుగా పరిగణిస్తారు. అయితే అక్కడ మిలిటరీ డిటెన్షన్ సెంటర్ లో.. కొత్తగా చేరిన ఓ ఖైదీ వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దీనితో అతనిని డీల్ చేయడానికి ఓ యంగ్ ఇంట్రాగేటర్ ఎంటర్ అవుతుంది. అతనితో నిజ నిజాలు బయటపెట్టించే క్రమంలో.. ఆ నిజాలు ఎన్నో యుద్ధాలకు దారి తీస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు కథ ఏంటి ఇవన్నీ తెలియాలంటే ఈ మినీ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి