iDreamPost

ఫుల్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్.. నీళ్లలో పడేసినా ఏం కాదు..!

  • Published Apr 11, 2024 | 7:06 PMUpdated Apr 11, 2024 | 7:06 PM

తాజాగా మార్కెట్ లో మరో కొత్త ఫీచర్స్ తో పూర్తిస్తాయి వాటర్ ప్రూఫ్ ఫోన్స్ అనేవి త్వరలో అవిష్కరణ జరగనుంది. మరి ఇంతకి ఆ వాటర్ ప్రూఫ్ ఫోన్స్ కంపెనీ దాని ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా మార్కెట్ లో మరో కొత్త ఫీచర్స్ తో పూర్తిస్తాయి వాటర్ ప్రూఫ్ ఫోన్స్ అనేవి త్వరలో అవిష్కరణ జరగనుంది. మరి ఇంతకి ఆ వాటర్ ప్రూఫ్ ఫోన్స్ కంపెనీ దాని ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Apr 11, 2024 | 7:06 PMUpdated Apr 11, 2024 | 7:06 PM
ఫుల్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్.. నీళ్లలో పడేసినా ఏం కాదు..!

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేని వారు, దానిని వినియోగించని వారంటూ ఎవరు లేరు. అంతలా స్మార్ట్ ఫోన్స వినియోగం అనేది క్రమంగా పేరిగిపోయింది. అయితే ఒకప్పుడు ఈ మొబైల్ ఫోన్ వినియోగం అనేది అవసరంగా ఉండేది. కానీ, ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్స్ వినియోగం అనేది అనివార్యంగా మారిపోయింది. అందువల్ల చిన్న నుంచి పెద్ద వరకు ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ అనేవి దర్శనం ఇస్తున్నాయి. అంతేకాకుండా.. స్మార్ట్ ఫోన్ యూజర్స్ పెరగడంతో.. మార్కెట్ లో కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ డిమాండ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మార్కెట్ లో ఎప్పటికప్పుడు రకరకాల కంపెనీలతో స్మార్ట్ ఫోన్స్ అనేవి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే తాజాగా మార్కెట్ లో మరో కొత్త ఫీచర్స్ తో పూర్తిస్తాయి వాటర్ ప్రూఫ్ ఫోన్స్ అనేవి త్వరలో అవిష్కరణ జరగనుంది. మరి ఇంతకి ఆ వాటర్ ప్రూఫ్ ఫోన్స్ కంపెనీ దాని ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.

ఈ మధ్యకాలంలో మార్కెట్ లో రకరకాల స్మార్ట్ ఫోన్స్ అనేవి కొత్త కొత్త స్టైల్స్ తో , లైట్ వెయిటో ఒకదానికి మించి మరొకటి ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగానే త్వరలో పూర్తిస్తాయి వాటర్ ప్రూఫ్ ఫోన్ మార్కెట్ లో సందడి చేయనుంది. అయితే మన్నిక, నాణ్యత, వేగం కలిగిన ఈ ఫోన్ వినియోగదారులను ఎంతోగానో ఆకట్టుకుంటుందని కంపెనీ హామీ ఇస్తుంది. అయితే ఈ పూర్తి స్థాయి వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ అనేవి ప్రముఖ సెల్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి విడుదల కానుంది. దీనిని ఏప్రిల్ 12న ఆవిష్కరించేందుకు చేసేందుకు ఆ కంపెనీ సన్నాహాలు చేసింది. ఇది ప్రపంచంలోనే మెట్టమొదటి పూర్తిస్థాయి వాటర్ ప్రూఫ్ పరికరమని ఆ సంస్థ చెబుతున్నారు. అంతేకాకుండా.. వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్లతో పాటు వాటర్ ప్రూఫ్ ఈ ఫోన్‌ గా అందుబాటులోకి రానుంది. కాగా, ఈ కొత్త ఫోన్ ను ఒప్పో ఏ3 ప్రోగా పిలుస్తున్నారు. దీనికి ఐపీ 69 రేటింగ్‌కు మద్దతు ఉన్నందున డస్ట్‌ప్రూఫ్, వాటర్‌ ప్రూఫ్‌గా పని చేస్తుంది. దీని డిస్‌ప్లే వాటర్‌ప్రూఫ్, ఫాల్స్‌కు రెసిస్టెంట్ అని కంపెనీ పేర్కొంది. ఒప్పో ఏ3 ప్రో 5జీ ఫోన్ మొదట చైనాలో విడుదల అవుతుంది. ఆ తర్వాత.. ఇతర మార్కెట్ల లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కానీ, ఇది మన దేశంలో విడుదల అవుతుందో, లేదో స్పష్టత లేదు. అలాగే ఈ కంపెనీ గతంలో తన ఏ సిరీస్ ఫోన్‌లను మన దేశంలో విడుదల చేసింది.

ఇక చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో తెలిపిన వివరాల ప్రకారం..  ఒప్పో ఏ3 ప్రో స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల 1080పీ 120హెచ్ జెడ్ ఓలెడ్ కర్వ్డ్ స్క్రీన్ కలిగి ఉంది.  అలాగే దీనిలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఏర్పాటు చేశారు. దీంతో తరచూ చార్జింగ్ పెట్టే పని లేకుండా..  ఎక్కువ గంటలు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. పైగా  మీడియా టెక్ 7050 ప్రాసెసర్‌తో పనిచేసే 5జీ ఫోన్ ఇది.  అలాగే 12 జీబీ ర్యామ్ కారణంగా.. దీని పనితీరు వేగవంతంగా ఉంటుంది. ఇక  512 జీబీ స్టోరేజీతో ఈ ఫోన్ మార్కెట్ లో  లభిస్తుంది. ఈ ఫోన్ కు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది.  పైగా దీని వెనుక 64 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. మిగిలిన వాటికి  మాత్రం ఇంక పూర్తి వివరాలు తెలియలేదు. అయితే  ఈ ఫోన్ విడుదల కోసం వినియోగదారులు  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Oppo A3 pro full water proof phone

కాగా, ఒప్పొ ప్రెసిడెంట్ బో లియు తెలిపిన వివరాల ప్రకారం.. తమ కంపెనీ ఏ సిరీస్ ఫోన్ల నుంచి మెరుగైన మరింత మెరుగైన సాంకేతికతను వినియోగదారులకు పరిచయం చేశామన్నారు. కొత్త ఒప్పో ఏ3 ప్రో మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి వాటర్‌ప్రూఫ్ ఫోన్ అన్నారు. ఇది మన్నికతో పాటు నాణ్యమైన సామర్థ్యంతో పనిచేస్తుందని తెలిపారు. ఏదిఏమైనా సెల్ ఫోన్ మార్కెట్ లో ఒప్పో ఏ3 ప్రో కొత్త సంచలనం కానుందని, కొనుగోలుదారుల అభిమానం చూరగొంటుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. మరి, మార్కెట్ త్వరలో అందుబాటులోకి రానున్న పూర్తి స్థాయి వాటర్ ప్రూఫ్ ఒప్పో ఏ3 ప్రో 5జీ ఫోన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి