iDreamPost

పోలీస్ జాబ్ మీ కలనా? 10th, ఇంటర్‌ పాసైతే చాలు.. SI, కానిస్టేబుల్‌ జాబ్స్ రెడీ

మీరు పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? పోలీస్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా అయితే ఈ ఉద్యోగాలను వదలకండి. ఎస్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

మీరు పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? పోలీస్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా అయితే ఈ ఉద్యోగాలను వదలకండి. ఎస్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

పోలీస్ జాబ్ మీ కలనా? 10th, ఇంటర్‌ పాసైతే చాలు.. SI, కానిస్టేబుల్‌ జాబ్స్ రెడీ

యూత్ లో పోలీస్ జాబ్స్ కు ఉండే క్రేజే వేరు. పోలీస్ జాబ్స్ సాధించేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు యువత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే పోలీస్ ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత పోటీపడుతుంటారు. పోలీస్ ఉద్యోగాలు సాధిస్తే మంచి జీతంతో పాటు సమాజానికి సేవ చేసే భాగ్యం దక్కుతుంది. సొసైటీలో మంచి గుర్తింపు ఉంటుంది. మరి మీకు కూడా పోలీస్ ఉద్యోగాలంటే ఇష్టమా? పోలీస్ జాబ్ సాధించడమే మీ కలనా? అయితే మీ కలను నెరవేర్చుకునే అవకాశం వచ్చింది. మీరు టెన్త్, ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నట్లైతే వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఎస్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 162 ఎస్‌ఐ,హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ గ్రూప్- బీ, సీ (నాన్ గెజిటెడ్) పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 1వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీలు:

  • 162
  • ఎస్‌ఐ (మాస్టర్): 07
  • ఎస్‌ఐ (ఇంజిన్ డ్రైవర్): 04
  • హెడ్‌ కానిస్టేబుల్‌ (మాస్టర్): 35
  • హెడ్‌ కానిస్టేబుల్‌ (ఇంజిన్ డ్రైవర్): 57
  • హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్ షాప్) (మెకానిక్) (డీజిల్/ పెట్రోల్ ఇంజిన్): 03
  • హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్ షాప్) (ఎలక్ట్రీషియన్): 02
  • హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్ షాప్) (ఏసీ టెక్నీషియన్): 01
  • హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్ షాప్) (ఎలక్ట్రానిక్స్): 01
  • హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్ షాప్) (మెషినిస్ట్): 01
  • హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్ షాప్) (కార్పెంటర్): 03
  • హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్ షాప్) (ప్లంబర్): 02
  • కానిస్టేబుల్ (క్రూ): 46

అర్హత:

  • పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, ఇంటర్‌ ఉత్తీర్ణత, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికెట్, సెరాంగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • ఎస్సై (మాస్టర్), ఎస్సై (ఇంజిన్ డ్రైవర్) పోస్టులకు 22 నుంచి 28 ఏళ్ల మధ్య; హెచ్‌సీ (మాస్టర్), హెచ్‌సీ (ఇంజిన్ డ్రైవర్), హెచ్‌సీ (వర్క్ షాప్), కానిస్టేబుల్ (క్రూ) పోస్టులకు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ఎస్‌ఐ పోస్టులకు రూ.35,400-1,12,400, హెచ్‌సీ పోస్టులకు రూ.25,500- రూ.81,100, కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700-రూ69,100 అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్‌ఐ పోస్టులకు రూ.200 చెల్లించాలి. హెచ్‌సీ/ కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 01-07-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి