iDreamPost

బ్రేకింగ్: ఢిల్లీలో మరోసారి భూకంపం.. ఆందోళనకు గురైన ప్రజలు

ఢిల్లీలో మరోసారి భూకంపం వణికించింది. అర్థరాత్రి భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. చైనాలో కూడా భారీ భూకంపం చోటుచేసుకుంది.

ఢిల్లీలో మరోసారి భూకంపం వణికించింది. అర్థరాత్రి భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. చైనాలో కూడా భారీ భూకంపం చోటుచేసుకుంది.

బ్రేకింగ్: ఢిల్లీలో మరోసారి భూకంపం.. ఆందోళనకు గురైన ప్రజలు

ఇటీవల వరుస భూకంపాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆకస్మాత్తుగా చోటుచేసుకునే భూ కంపాలతో భారీగా ఆస్థి, ప్రాణ నష్టాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ మధ్య జపాన్ లో సంభవించిన భూకంపం అక్కడి ప్రజలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో భూకంపాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా చైనాలో భారీ భూకంపం సంభవించింది. అయితే ఆ ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలో కూడా కనిపించింది. సోమవారం అర్ధరాత్రి ఢిల్లీలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ లోనిఅనేక ప్రాంతాల్లో నిన్న రాత్రి భూకంపం సంభవించింది. దీంత స్థానిక ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.2 తీవ్రతగా నమోదయిందని నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం చైనాలోని దక్షిన జిన్ జియాంగ్ లో ఉందని తెలిపారు. భూకం కేంద్రం భూమికి 80 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు. భారీ భూకంపంతో చైనా వణికిపోయింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. అయితే భూకంప ప్రభావంతో ఆస్థి, ప్రాణ నష్టాలు ఏమైన జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి