iDreamPost
android-app
ios-app

నో ఫన్.. ఓన్లీ హార్రర్! వణుకుపుట్టిస్తున్న ‘మాన్షన్ 24’ ట్రైలర్!

  • Author ajaykrishna Published - 02:55 PM, Wed - 4 October 23
  • Author ajaykrishna Published - 02:55 PM, Wed - 4 October 23
నో ఫన్.. ఓన్లీ హార్రర్! వణుకుపుట్టిస్తున్న ‘మాన్షన్ 24’ ట్రైలర్!

టీవీ హోస్ట్ కం డైరెక్టర్ ఓంకార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో టీవీ ప్రోగ్రాంలతో అలరిస్తున్న ఓంకార్.. అప్పుడప్పుడు డిఫరెంట్ సినిమాలు తీస్తూ మెప్పిస్తున్నాడు. ఇప్పటిదాకా దర్శకుడిగా జీనియస్, రాజుగారి గది మూడు పార్ట్స్ తీసి అదరగొట్టేసాడు. ఓంకార్ కి హారర్ జానర్ లో మంచి పట్టుంది. అది ఆల్రెడీ కొన్ని థ్రిల్లింగ్ టీవీ ప్రోగ్రాంలతో.. హార్రర్ మూవీస్ తో ప్రూవ్ చేసుకున్నాడు. 2019లో ఓంకార్ చివరిగా రాజుగారి గది 3 తీశాడు. ఆ తర్వాత మళ్ళీ టీవీ ప్రోగ్రాంలవైపు వెళ్ళిపోయాడు. ఒక్క సినిమా కూడా చేయలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు నాలుగేళ్లకు ఓ ఓటిటి వెబ్ సిరీస్ ని సిద్ధం చేశాడు.

ఓంకార్ డైరెక్టర్ గా ఓ ప్రాజెక్ట్ వస్తుందంటే.. ఖచ్చితంగా హార్రర్ ఎలిమెంట్స్ ఉంటాయని ప్రేక్షకులకు అర్థమైపోతుంది. తాజాగా ఓంకార్ ‘మాన్షన్ 24’ అనే సిరీస్ తీశాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అక్టోబర్ 17 నుండి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. కాగా.. తాజాగా ఈ సిరీస్ కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ సిరీస్ లో.. సత్యరాజ్, అవికా గోర్, రావు రమేష్, రాజీవ్ కనకాల, నందు, బిందు మాధవి, అయ్యప్ప పి శర్మ, కాలకేయ ప్రభాకర్, విద్యుల్లేఖ రామన్, సూర్య, అమర్ దీప్, అర్చన జోయిస్ కీలకపాత్రలలో మెరిశారు. మొత్తంగా బిగ్ బడ్జెట్ తో టెక్నికల్ గా కూడా రిచ్ గా తెరకెక్కించారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. కథను రెండున్నర నిమిషాలలో సబ్జెక్టు దేని గురించో దాచకుండా చెప్పేశారు. గవర్నమెంట్ ఆఫీసర్ కాళిదాస్(సత్యరాజ్) దేశద్రోహి అనే ఆరోపణలతో మాయమైపోతాడు. అతని భార్య (తులసి)మంచాన పడటంతో.. తండ్రి దేశద్రోహి కాదని ప్రూవ్ చేసేందుకు కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ బయలు దేరుతుంది. ఆఖరికి తండ్రి మాన్షన్ 24 అనే బంగ్లాకు వెళ్లాడని తెలుసుకొని.. అక్కడికి వెళ్తుంది. అక్కడ వరలక్ష్మికి భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి. మరి మాన్షన్ కి వెళ్లినవారు ఎవరు తిరిగి రాలేదని చెప్పినా వినకుండా వెళ్లిన వరలక్ష్మి.. తిరిగి వచ్చిందా? తండ్రిని కలిసిందా? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఈసారి ఓంకార్ చాలా సీరియస్ మోడ్ లో తీశారు. ఎక్కడ కూడా కామెడీ, ఫన్ ఎలిమెంట్స్ లేకుండా హార్రర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కవర్ చేశారు. మరి ఓటిటి అయినా.. ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మాన్షన్ 24 హిట్ ఖాయమే.

gamdomCasibommarsbahis girişMarsbahisJojobet Giriş