iDreamPost
android-app
ios-app

వీడియో: సిధి ఘటన.. గిరిజనుడిపై మూత్రం పోసిన వ్యక్తి ఇల్లు ధ్వంసం..!

వీడియో: సిధి ఘటన.. గిరిజనుడిపై మూత్రం పోసిన వ్యక్తి ఇల్లు ధ్వంసం..!

మధ్యప్రదేశ్ లో గిరుజనుడిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. దేశంలో అసలు గిరిజనులు, మైనారిటీలకు రక్షణ ఉందా అనే ప్రశ్నలు కూడా జోరందుకున్నాయి. ఒక్క మధ్యప్రదేశ్ ప్రభుత్వ మీదనే కాకుండా బీజేపీపైనే విమర్శలు చేసేలా చేసింది. అందుకే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సీన్ లోకి బుల్డోజర్ ఎంట్రీ ఇచ్చింది. ఎవరైతే అలా ప్రవర్తించాడో అతని ఇంటిని ధ్వంసం చేసింది.

మధ్యప్రదేశ్ సిధి ప్రాంతంలో బీజేపీ నేత అనుచరుడు గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బీజేపీ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దిద్దుబాటు చర్యలలో భాగంగా ప్రభుత్వం బుల్డోజర్ ను రంగంలోకి దింపింది. ప్రవేశ్ శుక్లా ఇంటిని అధికారులు బుల్డోజర్ తో ధ్వంసం చేయించారు. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. ఇప్పటికే ప్రవేశ్ శుక్లాను అరెస్టు కూడా చేశారు.

మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం బాధితుడిని కలిసిన విషయం తెలిసిందే. బాధితుడిని కలిసిన శివరాజ్ సింగ్ చౌహాన్ అతనితో ముచ్చటించారు. అతడిని కుర్చీలో కూర్చోబెట్టి.. అతని కాళ్లు కడిగి ఆ నీళ్లు తన నెత్తి మీద పోసుకున్నారు. అతని మెడలో దండ వేసి సన్మానించారు. ప్రవేశ్ శుక్లా చేసిన పనితో జరిగిన నష్టాన్ని అధికారులు, సీఎం చేసిన పనులు కాస్త పూడ్చే ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలాంటి చర్యలు ఎవరు చేసినా సహించకూడదని.. తగిన చర్యలు తీసుకోవాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.