iDreamPost

రెండు కుటుంబాల మధ్య అందమైన ప్రేమ – Nostalgia

రెండు కుటుంబాల మధ్య అందమైన ప్రేమ – Nostalgia

యూత్ లో ఫాలోయింగ్ వచ్చిన కుర్ర హీరోలతో సినిమాలు చేయడం రిస్క్ లేకుండా అనిపిస్తుంది కానీ కేవలం క్రేజ్ ని నమ్ముకుని తీస్తే మాత్రం చేతులు కాలడం ఖాయం. అందుకే ఇలాంటి చిత్రాలు తీసినవారందరూ హిట్లు అందుకోలేరు. కానీ అనుభవం ముందుచూపు ముందు ఏదైనా తల వంచాల్సిందే. అందుకు ఓ ఉదాహరణ చూద్దాం. 2002 సంవత్సరంలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఒకటి రెండు తప్ప అన్ని సూపర్ సక్సెస్ లే. శివయ్య, గణేష్, ప్రేయసి రావే, కలిసుందాం రా, జయం మనదేరా, ప్రేమించు ఇలా ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్లు వచ్చి పడ్డాయి. అదే సమయంలో నువ్వే కావాలి రిలీజై తరుణ్ హాట్ కేక్ అయ్యాడు.

తమ బ్యానర్ లోనే సహాయ దర్శకుడిగా పని చేసిన కాశీ విశ్వనాధ్(ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్)ను డైరెక్టర్ గా ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారు సురేష్ బాబు. అతను చెప్పిన నువ్వు లేక నేను లేను కథ విపరీతంగా నచ్చేసింది. స్టార్ హీరోతో చేయాలనుకుని తర్వాత మనసు మార్చుకున్నారు. ఇమేజ్ సమస్యలు లేని యూత్ కథానాయకుడిని తీసుకుంటే న్యాయం జరుగుతుందని భావించి తరుణ్ ని లాక్ చేశారు. నువ్వు నాకు నచ్చావ్ తో ఓవర్ నైట్ డ్రీం గర్ల్ గా మారిన ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా మాటలు కూడా తనే సమకూర్చుకున్నారు కాశి విశ్వనాద్. ఆర్ పి పట్నాయక్ మధురమైన సంగీతాన్ని సిద్ధం చేశారు.

ఇందులో మరీ కొత్త కథేమీ ఉండదు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన రెండు కుటుంబాలకు చెందిన ఓ అమ్మాయి అబ్బాయి తమ మధ్య ఉన్నది స్నేహమే అనుకుంటారు. ఆ తర్వాత ఏర్పడిన కొన్ని పరిస్థితుల తర్వాత తమ జీవితంలో ఇంకో భాగస్వామి వచ్చే ప్రయత్నం చేసే వరకు ఇద్దరి మధ్య ప్రేమ ఉందని గుర్తించరు. ఈ పాయింట్ ని కాశి విశ్వనాథ్ డీల్ చేసిన తీరు ఫ్యామిలీ ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అయ్యింది. కళాతపస్వి కె విశ్వనాధ్, సునీల్, శరత్ బాబు, చంద్రమోహన్ పాత్రలు బలంగా నిలబడ్డాయి. 2002లో సీమసింహం, టక్కరి దొంగ, బ్రహ్మచారిలతో విపరీతమైన పోటీని ఎదురుకుని జనవరి 14న రిలీజైన నువ్వు లేక నేను లేను అంచనాలకు మించి సూపర్ హిట్ కొట్టి సురేష్ బాబు నమ్మకాన్ని నిజం చేసింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి