iDreamPost

నువ్వే కావాలి నటి వర్ష.. ఎంతలా మారిపోయిందో చూడండి

నువ్వే కావాలి సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో పాటలు ఎవర్ గ్రీన్. ఇప్పటికీ వీనుల విందుగా ఉంటాయి. ఈ సినిమాలో తరుణ్, రిచాల నటనతోనే కాకుండా.. మరో నటి కూడా మెప్పిస్తుంది. ఆమెనే..

నువ్వే కావాలి సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో పాటలు ఎవర్ గ్రీన్. ఇప్పటికీ వీనుల విందుగా ఉంటాయి. ఈ సినిమాలో తరుణ్, రిచాల నటనతోనే కాకుండా.. మరో నటి కూడా మెప్పిస్తుంది. ఆమెనే..

నువ్వే కావాలి నటి వర్ష.. ఎంతలా మారిపోయిందో చూడండి

‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది..చెలీ ఇదేం అల్లరి’ ‘అనగనగ ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది’ ‘కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు’ నువ్వే కావాలి సినిమాలో సాంగ్స్ వింటుంటే ఎంత వీనుల విందుగా ఉంటాయో.. మూవీ కూడా అంతే బాగుంటుంది. 2000లో విడుదలైన చిన్న బడ్జెట్ చిత్రం.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఇందులో తరుణ్, రిచా నటన ఎక్స్ లెంట్ అని చెప్పాలి. తరుణ్, రిచాల ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించిన వారే. ఎదిగాక.. వీరిద్దరికీ ఇది తొలి సినిమా. సాయి కిరణ్, వర్ష, కోవై సరళ, చలపతి రావు, సునీల్, ఎంఎస్ నారాయణ, ఢిల్లీ రాజేశ్వరి, ఎంఎస్ నారాయణ ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించాడు.

ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు, స్రవంతి రవి కిషోర్ నిర్మాతలుగా వ్యవహరించగా.. కుటుంబ కథా చిత్రాల డైరెక్టర్ విజయ్ భాస్కర్ ఈ చిత్రానికి మెగా ఫోన్ పట్టాడు. నీరమ్ అనే మలయాళ చిత్రం నుండి రీమేక్ అయిన ఈసినిమా 200 రోజులకు పైగా థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమా మొత్తం కొత్త వారితో తెరకెక్కించడంతో పాటు పాటలు, ప్లాట్ బాగుండటంతో ఇరగబడి చూశారు జనం. కాలేజీ సన్నివేశాలు చాలా సరదాగా సాగిపోతుంటాయి. తరుణ్, రిచాల స్నేహం, ప్రేమ ఈ సినిమాను తారా స్థాయికి తీసుకెళ్లాయి. ఇందులోనే తరుణ్ ప్రేమిస్తూ ఉంటుంది వర్ష. పలకరించడం ఆలస్యం తానే పడిపోతూ తానే ‘సారీ’ చెబుతూ ఉంటుంది. చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటుంది నటి వర్ష. అందులో ఆమె క్యారెక్టర్ పేరు కూడా వర్షనే.

అంతకు ముందు చాలా సినిమాలు చేసినా ఈ మూవీతో ఆమె పేరు వచ్చింది. వర్ష అసలు పేరు మాధవి. సినిమా కోసం పేరు మార్చుకుంది. చెల్లెలిగా, స్నేహితురాలిగా అనేక సినిమాల్లో మెప్పించింది. సుస్వాగతం, సూర్యవంశం, ఆహా, తమ్ముడు చిత్రాల్లో సపోర్టింగ్, సిస్టర్ క్యారెక్టర్ చేయగా.. నువ్వే కావాలితో సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించింది. మంచి గుర్తింపే వచ్చినప్పటికీ.. లీడ్ యాక్టర్‌గా అవకాశాలు రాలేదు. నువ్వు వస్తావని, ప్రియమైన నీకులో మంచి రోల్స్ దక్కాయి. మరోసారి ఆమె పేరు వినిపించేలా చేసిన చిత్రం సింహరాశి. రాజశేఖర్ చెల్లెలిగా నటించి..ప్రశంసలు దక్కించుకుంది. వాసులో వెంకటేశ్ చెల్లెలిగా మెప్పించింది.

సత్యం, దొంగోడు, దొంగ దొంగది, మాస్, కాశీ, నాయకుడు వంటి చిత్రాల్లో కనిపించింది. సినిమాలకు దూరంగా ఉన్న ఆమె బుల్లితెరపై సందడి చేస్తోంది. మనసు, మమత, అత్తారింటికి దారేది, కస్తూరి, మట్టిగాజులు అనే సీరియల్స్ చేసింది. మందాకినీ అనే ఓటీటీ సీరియల్లోనూ కనిపించింది. ఇది ఆహాలో ప్రసారం అయ్యింది. మా టీవీలో ప్రసారమైన మల్లి అనే ధారావాహికలో నటించింది వర్ష. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన షూటింగ్ వీడియోలు, తోటి నటులతో కలిసి రీల్స్ చేస్తూ సందడి చేస్తోంది. మొత్తానికి అప్పటికీ ఇప్పటికీ చాలా ఛేంజెస్ వచ్చాయి ఆమెలో. 20 ఏళ్ల క్రితం వెండితెరను విడిచిపెట్టిన ఈ తెలుగింటి ఆడపడుచు.. మళ్లీ కనిపిస్తుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Varsha Ajay_Official (@varshajay2006)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి