iDreamPost

పదో తరగతి చదివే బాలికలకు శుభవార్త చెప్పిన ఎన్టీఆర్ ట్రస్ట్

టెన్త్ చదివే విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ మరో శుభవార్త చెప్పింది. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని, దీనికి అర్హత కలిగిన బాలికలు అప్లయ్ చేసుకోవాలని కోరారు.

టెన్త్ చదివే విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ మరో శుభవార్త చెప్పింది. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని, దీనికి అర్హత కలిగిన బాలికలు అప్లయ్ చేసుకోవాలని కోరారు.

పదో తరగతి చదివే బాలికలకు శుభవార్త చెప్పిన ఎన్టీఆర్ ట్రస్ట్

ప్రతిభ గల విద్యార్థులను ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థికంగా వెనకడిన విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఈ ట్రస్ట్ వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. అయితే ఇందులో భాగంగానే పదో తరగతి చదివి విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తాజాగా మరో శుభవార్త అందించింది. ప్రతిభ గల విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ మెరిట్ స్కాలర్ షిప్ పేరుతో ఉపకార వేతనం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ ఏడాది స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వాహించాల్సిన తేదీలు కూడా ప్రకటించింది. దీనికి అర్హత కలిగిన విద్యార్థులు అప్లయ్ చేసుకోవాలని కోరింది. ఇంతకు ఎన్టీఆర్ ట్రస్ట్ కు ఎవరు అర్హులు? స్కాలర్ షిప్ ఎంత ఇస్తారు? పరీక్ష ఎప్పుడు ఉంటుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలో ప్రతిభ గల విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఓ శుభవార్త తెలిపారు. పదో తరగతి చదివే బాలికలకు ఎన్టీఆర్ ట్రస్ట్ మెరిట్ స్కాలర్ షిప్ ఇవ్వనున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే డిసెంబర్ 17 మెరిట్ స్కాలర్ షిప్ పరీక్ష ఉంటుందని అన్నారు. దీనికి అర్హత కలిగిన బాలికలు అందరూ దరఖాస్తు చేసుకోవాలని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కోరారు. ఇందులో భాగంగానే మొదటి 10 ర్యాంకులు సాధించిన 25 మంది బాలికలకు నెలకు రూ.5 వేలు ఇస్తామని ప్రకటనలో తెలిపారు.

ఇక తర్వాత 15 ర్యాంకులు పొందిన వారికి నెలకు రూ.2 వేలు స్కాలర్ షిప్ ఇస్తామన్నారు. ఈ స్కాలర్ షిప్ బాలికలు ఇంటర్ పూర్తయ్యే వరకు ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు. అయితే ఈ అవకాశాన్ని పదో తరగతి చదువుతున్న బాలికలందరూ వినియోగించుకోవాలని నారా భువనేశ్వరి తెలిపారు. ఇక ఆసక్తి గల బాలికలు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌నకు నవంబర్‌ 18 నుంచి డిసెంబర్‌ 15 వరకు www.ntrcollegeforwomen.education అనే వెబ్‌సైట్‌లో అప్లయ్ చేసుకోవాలని ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఇక పరీక్ష డిసెంబర్ 17న ఉంటుందని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి