iDreamPost

SRH vs LSG: ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ కాదు.. నిన్నటి మ్యాచ్‌లో అసలైన హీరో ఇతనే!

  • Published May 09, 2024 | 11:12 AMUpdated May 09, 2024 | 11:12 AM

Travis Head, Abhishek Sharma, Nitish Kumar Reddy: లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ విజయంలో ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ కీలక పాత్ర పోషించారు. కానీ, వారిలానే మరో ప్లేయర్‌ కూడా హీరోలా నిలిచాడు. అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Travis Head, Abhishek Sharma, Nitish Kumar Reddy: లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ విజయంలో ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ కీలక పాత్ర పోషించారు. కానీ, వారిలానే మరో ప్లేయర్‌ కూడా హీరోలా నిలిచాడు. అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 09, 2024 | 11:12 AMUpdated May 09, 2024 | 11:12 AM
SRH vs LSG: ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ కాదు.. నిన్నటి మ్యాచ్‌లో అసలైన హీరో ఇతనే!

ఐపీఎల్‌ 2024లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లు సృష్టించిన విధ్వంసం గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ, నిన్నటి మ్యాచ్‌లో వాళ్లిద్దరు కాకుండా ఓ రియల్‌ హీరో ఉన్నాడు. సూపర్‌ బ్యాటింగ్‌తో ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లను ఊచకోత కోస్తే.. నితీష్‌ కుమార్‌ రెడ్డి మాత్రం తనదైన సూపర్‌ ఫీల్డింగ్‌తో లక్నో సూపర్‌ జెయింట్స​ బ్యాటర్లను మానసికంగా దెబ్బ కొట్టాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 166 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేసి గెలిచిందని అంతా అనుకుంటున్నారు. కానీ, నిజానికి ఈ మ్యాచ్‌ను డికాక్‌ రూపంలో లక్నో తమ తొలి వికెట్‌ కోల్పోయిన సమయంలో మ్యాచ్‌ను ఓడిపోయింది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ రెడ్డి వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ తొలి బంతిని లక్నో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ లెగ్‌ సైడ్‌ అద్భుతమైన షాట్‌ ఆడాడు. అది సిక్స్‌ అని అంతా డిసైడ్‌ అయిపోయారు. కానీ, అక్కడే కాచుకుని కూర్చున్న నితీష్‌ కుమార్‌ రెడ్డి గాల్లోకి ఎగిరి మరీ ఆ బాల్‌ను లటుక్కున అందుకున్నాడు. వెంటనే బ్యాలెన్స్‌ ఆపుకోలేక బౌండరీ లైన్‌ దాటుతున్నట్లు గమనించిన నితీష్‌ వెంటనే బాల్‌ను గాల్లోకి విసిరి.. మళ్లీ బౌండరీ లైన్‌ లోపలికి వచ్చి.. క్యాచ్‌ను అద్భుతంగా ఫినిష్‌ చేశాడు. దీంతో.. డికాక్‌ అవుట్‌ అయ్యాడు. అంత సూపర్‌ షాట్‌ ఆడినా కూడా అవుట్‌ అవ్వడంతో లక్నో బ్యాటర్లలో ఒకింత నిరాశ కనిపించింది.

ఆరంభంలోనే డికాక్‌ లాంటి కీలక వికెట్‌ పడిపోవడంతో ఆ వెంటనే స్టోయినీస్‌ కూడా అవుట్‌ కావడంతో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ నిదానంగా బ్యాటింగ్‌ చేశాడు. రాహుల్‌ స్లో బ్యాటింగ్‌తో లక్నో 10 ఓవర్లలో కేవలం 57 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆరంభంలో కాస్త స్లో ఉండి, తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారినా.. ఆరంభంలో సూపర్‌ క్యాచ్‌, ఆ తర్వాత అద్భుతమైన ఫీల్డింగ్‌తో లక్నోను తన వంత దెబ్బతీశాడు నితీష్‌కుమార్‌ రెడ్డి. లక్నో ఇన్నింగ్స్‌ చివరి బాల్‌ సైతం సిక్స్‌ వెళ్లకుండా ఆపాడు. ఇలా తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో లక్నో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో వాళ్ల ఓటమిని శాసించాడు మన తెలుగు కుర్రాడు నితీష్‌కుమార్‌ రెడ్డి. మరి ఈ మ్యాచ్‌లో నితీష్‌ సూపర్‌ ఫీల్డింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి