iDreamPost

ఇంట్లో ఉన్నా.. ఆఫీసులో ఉన్నా.. రూల్‌లో మార్పులేదు

ఇంట్లో ఉన్నా.. ఆఫీసులో ఉన్నా.. రూల్‌లో మార్పులేదు

కరోనా వైరస్‌ వల్ల దేశంలో వైద్య అత్యసర పరిస్థితి నెలకొంది. ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించి వారం రోజులవుతోంది. ఈ నెల 14వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించే సమయంలోనే ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇచ్చారు. అత్యవసర విభాగాల ఉద్యోగులు మినహా మిగతా శాఖల ఉద్యోగులు 20 శాతం హాజరైతే చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. కొంత మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు కొత్త సందేహం వచ్చింది. మార్చి నెలాఖరుతో ఉద్యోగ విరమణ చేసే వారి సర్వీస్‌ ముగిసినట్లేనా..? లేదా..? కొనసాగుతున్నట్లా..? అనే సందేహాలు ఉద్యోగుల్లో నెలకొన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన సెలవుపైనా, వర్క్‌ ఫ్రం హోం విధానంలో సాధారణ విభాగాల ఉద్యోగులు పని చేస్తుండడంతో ఈ సందేహాలు వచ్చాయి.

ఉద్యోగుల్లో నెలకొన్న సందేహాలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కోవిద్‌ డ్యూటీలో ఉన్నా, ఇంట్లో ఉన్నా.. మార్చి నెలాఖరుతో సర్వీస్‌ ముగిసే వారు ఉద్యోగ విరమణ చేసినట్లేనని అదేశాలు జారీ చేసింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించక ముందే కొన్ని ప్రైవేటు కంపెనీలు వారి ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ, అన్ని రకాల ప్రవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ఇవ్వడమో లేదా ఇంటి నుంచి పని చేసే అవకాశం ఉంటే చేయించడమో చేస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి