iDreamPost

AP: ఆ ఊరిలో ఏ ఇంటికి రెండో అంతస్తు ఉండదు! పెద్ద కారణమే ఉంది!

  • Published Feb 23, 2024 | 2:54 PMUpdated Feb 23, 2024 | 2:54 PM

ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆస్తులున్న వారంతా మేడలు మిద్దెలు కట్టుకుంటూ ఉంటారు. అందులోను ఇప్పుడు సొంత ఇళ్ళు నిర్మించుకునే వారెవరూ ఒక అంతస్తుతో ఆగడం లేదు. ఖచ్చితంగా రెండు లేదా మూడు అంతస్తులను నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే గ్రామం మాత్రం ఇందుకు విరుద్ధం.

ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆస్తులున్న వారంతా మేడలు మిద్దెలు కట్టుకుంటూ ఉంటారు. అందులోను ఇప్పుడు సొంత ఇళ్ళు నిర్మించుకునే వారెవరూ ఒక అంతస్తుతో ఆగడం లేదు. ఖచ్చితంగా రెండు లేదా మూడు అంతస్తులను నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే గ్రామం మాత్రం ఇందుకు విరుద్ధం.

  • Published Feb 23, 2024 | 2:54 PMUpdated Feb 23, 2024 | 2:54 PM
AP: ఆ ఊరిలో ఏ ఇంటికి రెండో అంతస్తు ఉండదు! పెద్ద కారణమే ఉంది!

ప్రస్తుతం ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవనాల నిర్మాణమే జరుగుతుంది. ఆర్ధిక స్థోమత బావున్నా వారెవ్వరూ కూడా ఒక అంతస్తు ఆగడం లేదు. ఖచ్చితంగా రెండు మూడు అంతస్తులు ఒకేసారి నిర్మించేస్తునారు. కేవలం ఈ నిర్మాణం పట్టణాలకే పరిమితం అనుకుంటే పొరపాటే.. చిన్న చిన్న పల్లెటూళ్లలో సైతం ఈ భవన నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయి. ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారి వారి ఇళ్లను నిర్మించుకుంటున్నారు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ ఊరిలో మాత్రం.. వారికి ఎంత ఆస్తి ఉన్నా సరే .. ఇంటి పైన మరో అంతస్థు మాత్రం నిర్మించారట. అవసరమైతే మరో ఇంటిని నిర్మిస్తారే కానీ.. ఉన్న ఇంటి పైన మాత్రం మరో ఇల్లు వేయరట. దానికి కారణం ఏమై ఉంటుంది. ఇంతకీ ఏ గ్రామంలో ఇలాంటి నియమాలు ఫాలో అవుతున్నారు. అనే విషయాల గురించి తెలుసుకుందాం.

ఆస్తులున్నా సరే.. అంతస్తులు నిర్మించని గ్రామం మరోదే కాదు.. ప్రకాశం జిల్లాకు చెందిన పాతసింగరకొండ గ్రామం. ఏ గ్రామంలో సుమారు 700 మంది జనాభా ఉంటారు. అయితే, వారి వారి ఇళ్లలో కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినా సరే.. అందులోనే సర్దుకుపోతారు కానీ ఇంటిపై మరో అంతస్తును మాత్రం నిర్మించరు. అవసరమైతే మరో ఇంటినైనా నిర్మించుకుంటారు ఈ గ్రామస్థులు. అయితే, ఇలా అంతస్తులను నిర్మించకూడదని వీరిని ఎవరు ఆదేశించలేదు. ప్రభుత్వానికి కూడా దీనిలో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది కేవలం గ్రామస్తులంతా కలిసి తీసుకున్న నిర్ణయమేనట. ఇది వారికి తరతరాల నుంచి వస్తున్న ఆచారం అని కూడా అక్కడి గ్రామస్థులు చెబుతున్నారు. దానికి కారణం ఆ ఊరిలో ఉన్న లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం అని అక్కడి వాస్తవ్యులు తెలియజేశారు.

అయితే, లక్ష్మి నరసింహ స్వామి ఆలయం దిగువనే ఎప్పుడు వారు ఉంటే.. స్వామి వారి నీడలో వారు చల్లగా ఉంటారనే నమ్మకంతో.. ఇలా ఆలయం కంటే ఎత్తుగా.. ఎవరు వారి వారి ఇళ్లపై అంతస్తులు నిర్మించకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. అంటే స్వామి కంటే ఎత్తులో ఎప్పుడు ఉండకూడదని వారి భావన. గతంలో ఇలా ఎవరో నిర్మిస్తే వారి ఇంట్లో ఆకస్మిక మరణం చోటుచేసుకుందట. దీనితో ఆ ఊరి గ్రామస్థులలో ఈ నమ్మకాలు మరింత బలపడుతూ వచ్చాయి. కాబట్టి ఆ ఊరిలో ఇళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా దేనికి పై అంతస్థులు ఉండవు. ఇది అక్కడి వారు తరతరాలుగా నమ్ముతూ వస్తున్న ఆచారం. మారుతున్న కాలంలో ఇపుడున్న వారంతా అంతస్థులు నిర్మించాలని చూస్తున్నా సరే.. అక్కడి వారు మాత్రం తమ పూర్వీకుల నమ్మకాలపైనే ముందుకు సాగుతున్నారు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి