iDreamPost

చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు.. ఇప్పుడు కేజీ ఎంతంటే..?

  • Published Apr 02, 2024 | 9:26 AMUpdated Apr 02, 2024 | 9:26 AM

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి.. వారం రోజులలోనే వీటి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అసలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి.. వారం రోజులలోనే వీటి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అసలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • Published Apr 02, 2024 | 9:26 AMUpdated Apr 02, 2024 | 9:26 AM
చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు..  ఇప్పుడు కేజీ ఎంతంటే..?

చికెన్ ఇష్టపడని వారు ఎవరు ఉండరు. కానీ ఇప్పుడు వాటి ధరలను మాత్రం ఎవరు ఇష్టపడడం లేదు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే వీటి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గత కొన్ని రోజులలో.. ఏపీ, తెలంగాణలో ఎండలు ఏ విధంగా మండిపోతున్నాయో.. చికెన్ ధరలు కూడా అలానే మండిపోతున్నాయి. చికెన్ ప్రియులు ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పి తీరాలి. సామాన్యులు అంతా కూడా వీటి ధరలకు బెంబేలెత్తిపోతున్నారు. గత వారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. కోలో చికెన్ (స్కిన్ లెస్) ధర రూ.200 నుంచి రూ.220 వరకు పలికింది. స్కిన్ అయితే.. రూ.180 నుంచి రూ.200 వరకు ఉంది. కానీ ఇప్పుడు వీటి ధర గురించి తెలుసుకుంటే మాత్రం నోటి మీద వేలు వేసుకోవాల్సిందే.

ఇప్పుడు కిలో చికెన్ ధరకు పెట్టె డబ్బుతో.. గ్రామాల్లో అర కిలో మటన్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో స్కిన్ లెస్ చికెన్.. ధర రూ.300 వరకు పలుకుతుంది. స్కిన్‌తో అయితే రూ.280 ఉంది. కేవలం వారం వ్యవధిలోనే చికెన్ ధరలు అమాంతంగా పెరగడంతో .. కొనుగోలు దారులు ఆశ్చర్యపోతున్నారు. ఇలా చికెన్ ధరలు అడపా దడపా పెరుగుతూ, తగ్గుతూ ఉండడం సహజం కానీ.. వారం వ్యవధిలోనే ఇలా అమాంతంగా పెరగడంతో.. చికెన్ ప్రియులు షాక్ అవుతున్నారు. ఇక ఒక వైపు చికెన్ ధరలు కొండెక్కుతుంటే.. కోడి గుడ్ల ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. గత వారం రూ.7 పలికిన కోడిగుడ్డు ధర.. ఇప్పుడు కేవలం రూ.5 ఉంది. అయితే, కోడిగుడ్ల ధరలు మాత్రం ఇంతకంటే తగ్గే అవకాశం లేదు. కానీ, చికెన్ ధరలు మాత్రం రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి.. కోళ్లు చనిపోయే ప్రమాదం ఉందని.. దీని వలన.. కోళ్ల తక్కువగా లభిస్తాయి. అందువలన చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

కోళ్లు చనిపోవడం ఒకటే కాకుండా.. కోళ్ల దాణా ధరలు పెరగడం కూడా.. చికెన్ ధరలు పెరగడానికి ఒక కారణం అని.. ఫౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. కోళ్ల దాణాలో ఉపయోగించే సోయా, మొక్కజొన్న వంటి పంటల దిగుబడి .. ప్రస్తుతం పడిపోవడంతో.. మార్కెట్‌లో వీటి ధర పెరిగిపోతోంది. దీనితో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ చికెన్ ధరలపై పడింది. అందువలననే చికెన్ రేట్స్ అమాంతంగా పెరిగిపోతున్నాయి. వేసవి కాలంలో అనేక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి.. నీటి కొరత, ఉష్ణోగ్రతలు పెరగడం, ఇలాంటి వాటి వలన.. కోళ్లు మృత్యువాత పడుతుంటాయి.. దీనివలన కోళ్ల పెంపకం చాలా కష్టతరంగా మారుతుంది. అందువలన చికెన్ ధరలు.. రానున్న రోజుల్లో ఇంకా పెరగడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి