iDreamPost

CM Jagan: పెన్షన్ దారులతో CM జగన్ ముఖాముఖి.. ‘జగనే మా కొడుకు’!

  • Published Apr 08, 2024 | 1:50 PMUpdated Apr 08, 2024 | 2:58 PM

మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ వివరాలు..

మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ వివరాలు..

  • Published Apr 08, 2024 | 1:50 PMUpdated Apr 08, 2024 | 2:58 PM
CM Jagan: పెన్షన్ దారులతో CM జగన్ ముఖాముఖి.. ‘జగనే మా కొడుకు’!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పదకొండోరోజు సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా వెంకటాచలంపల్లిలో సామాజిక పింఛన్‌ లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. తమ ప్రభుత్వ హయాంలో పెన్షన్ పంపిణీ కోసం చేప్టటిన చర్యలు వివరించారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ.. తమను అన్ని విధాల ఆదుకుంటున్న జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు అండ్ కో వల్ల వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ ఆగిపోయిందని.. అలాంటి చంద్రబాబు కూటమి నాశనమవుతుందని లబ్ధిదారులు శాపనార్థాలు పెడుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ’’చంద్రబాబు పాలనలో పెన్షన్‌ ఎంత వచ్చేది మీకు గుర్తుందా. 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా కేవలం 39 లక్షల మందకి మాత్రమే పెన్షన్‌ వచ్చేది. ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో వచ్చిన మార్పు గమనించండి. అర్హత ఉంటే చాలు ప్రతీ ఒక్కరికీ పెన్షన్‌ అందించాం.కుల, మత, రాజకీయాలకు అతీతంగా పెన్షన్‌ అందిస్తూ వచ్చా. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 66 లక్షల మందికి పైగాపెన్షన్‌ అందిస్తున్నాం‘‘ అని చెప్పుకొచ్చారు.

’’ఇవాళ మన ప్రభుత్వ హయాంలో రూ.3 వేల వరకూ పెన్షన్‌ పెంచుకుంటూ వచ్చాం. జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీనే. నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. ప్రతి నెల పెన్షన్ల కోసం రూ. రెండు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ 58 నెలల్లో పెన్షన్ల కోసం 90 వేల కోట్లు ఖర్చు చేశాం. పేదలకు మంచి చేసే విషయంలో జగన్‌తో పోటీపడే వారు దేశంలోనే లేరు‘‘ అన్నారు.

’’అవ్వాతాతల ఆత్మ గౌరవం కోసం నేను ఆలోచన చేశాను. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్‌ వ్యవస్థ తీసుకోచ్చాం. వాలంటీర్లతో నేరుగా అవ్వాతాతల ఇంటికే పెన్షన్‌ పంపించాం. 56 నెలలుగా మన ప్రభుత్వం 1వ తేదీ ఉదయమే పెన్షన్‌ అందించింది. 14 ఏళ్లు సీఎంగా చేశానని చంద్రబాబు చెబుతుంటారు. ఏనాడైనా మీ గురించి ఆలోచించాడా. 2014లో చంద్రబాబు హామీలిచ్చి మోసం చేశారుచంద్రబాబు హామీల ఖర్చు లక్షా 40 వేల కోట్లు దాటిపోతున్నాయి. మోసం చేసేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే.. పులి నోట్లో తలపెట్టినట్టే‘‘ అన్నారు సీఎం జగన్.

సీఓం జగన్ ప్రసంగం అనంతరం పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ.. ’’మొన్నటి వరకు వాలంటీర్లు ఇంటికే పెన్షన్లు తెచ్చి ఇచ్చేవారు. చంద్రబాబు చేసిన పనితో ఈ నెల పెన్షన్‌ కోసం ఇబ్బంది పడ్డాం. మాకు వాలంటీర్‌ వ్యవస్థ ఉంటేనే మేలు జరుగుతుంది. చంద్రబాబు మాపై ఎందుకు కక్ష కట్టారో తెలియడం లేదు. వైఎస్‌ జగన్‌ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగింది. చంద్రబాబు పాలనలో కేవలం ఆయన మనుషులకే పెన్షన్‌ ఇచ్చేవారు. జన్మభూమి కమిటీ సిఫార్సులు చేసిన వారికే పెన్షన్‌ వచ్చేది. జగన్‌ పాలనలోనే అర్హత ఉ‍న్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్‌ వచ్చింది. సీఎం జగన్ మమ్మల్ని అన్ని విధాల ఆదుకుంటున్నారు. మాకు కొడుకులు, కోడళ్లు వద్దు.. జగనే మా బిడ్డ. మమ్మల్ని సాకుతుంది ఆయనే‘‘ అంటూ అవ్వాతాతలు భావోద్వేగానికి గురయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి