iDreamPost

ఎల్జీ పాలిమర్స్ మీద నాడే చంద్రబాబు చర్యలు తీసుకొని ఉంటే ?

ఎల్జీ పాలిమర్స్ మీద నాడే చంద్రబాబు చర్యలు తీసుకొని ఉంటే ?

ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ గ్యాస్ లీకేజీ ప్రమాదం నేపధ్యంలో చంద్రబాబునాయుడు నిర్వాకాన్ని ఎల్లోమీడియానే బయటపెట్టింది. రాష్ట్రంతో పాటు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల అనుమతులు లేవన్న విషయాన్ని చంద్రబాబు సొంత మీడియానే స్పష్టం చేసింది. ఎల్జీ పాలిమర్స్ కు పర్యావరణ అనుమతులు లేవన్న విషయాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సమావేశాల్లో చర్చించారు కానీ చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఆలోచించలేదని చెప్పింది. 2019 మే 10వ తేదీన ప్రభుత్వాలకు ఇచ్చిన అఫిడవిట్ లోనే కంపెనీ స్వయంగా అంగీకరించినట్లు ఎల్లోమీడియా చెప్పింది.

దాదాపు మూడేళ్ళ పాటు రాష్ట్ర, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే కంపెనీ నడిచిందంటే అందుకు బాధ్యులెవరు ? ఆ సమయంలో అధికారంలో ఉన్నది చంద్రబాబునాయుడే కదా ? ఎల్లోమీడియా తన కథనంలో కంపెనీ యాంగిల్ ను కథనం రాసిందే కానీ ఎక్కడ కూడా తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం అని కానీ చంద్రబాబే సిఎంగా ఉన్నాడని కాని ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు.

ఉత్పత్తి, విస్తరణకు 2009 నుండి 2014 వరకూ ఎటువంటి ప్రమాణాలు పాటించకపోయినా కంపెనీకి అన్నీ అనుమతులు వచ్చేసిందని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి పరిపాలన మొత్తం అస్తవ్యస్ధంగా ఉంది కాబట్టి కంపెనీ వ్యవహారాలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని చెప్పింది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చింది చంద్రబాబే అన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే 2014-19 మధ్య కంపెనీకి వచ్చిన అన్నీ అనుమతులకు చంద్రబాబుదే బాధ్యత.

ఒకవేళ అసలు ఎటువంటి అనుమతులు లేకపోయినా కంపెనీ పనిచేసిందంటే కూడా బాధ్యత వహించాల్సింది చంద్రబాబే. గ్యాస్ ప్రమాదం జరిగిన తర్వాత నుండి చంద్రబాబు అండ్ కో ప్రభుత్వంపై చేస్తున్నదంతా కేవలం ఎదురుదాడి మాత్రమే అని అర్ధమైపోతోంది. అంటే గ్యాస్ ప్రమాదానికి చంద్రబాబుది ప్రత్యక్ష బాధ్యత లేకపోయినా అనుమతులు లేకుండా కంపెనీ పనిచేసిందంటే అందుకు చంద్రబాబే బాధ్యత వహించాల్సుంటుందనటంలో సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి