iDreamPost

OTT Suggestion: పని కోసం వెళ్తే పడక సుఖం! ఈ OTT మూవీని.. ప్రతి మహిళా ఉద్యోగి చూడాలి!

  • Published May 02, 2024 | 4:19 PMUpdated May 02, 2024 | 4:19 PM

హర్రర్ చిత్రాలను ఈ మధ్య కాలంలో బాగా ఇష్టపడుతున్న సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ను బట్టి చాలా సినిమాలను ఆదరించేస్తున్నారు ప్రేక్షకులు, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం హర్రర్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిది.

హర్రర్ చిత్రాలను ఈ మధ్య కాలంలో బాగా ఇష్టపడుతున్న సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ను బట్టి చాలా సినిమాలను ఆదరించేస్తున్నారు ప్రేక్షకులు, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం హర్రర్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిది.

  • Published May 02, 2024 | 4:19 PMUpdated May 02, 2024 | 4:19 PM
OTT Suggestion: పని కోసం వెళ్తే పడక సుఖం! ఈ OTT మూవీని.. ప్రతి మహిళా ఉద్యోగి చూడాలి!

హర్రర్ సినిమాలు ఎంత సేపు చూసిన అసలు బోర్ కొట్టవు. కొన్ని సినిమాలు ఒంటరిగా కూడా చూడలేము అంత భయకరమైన సన్నివేశాలు ఆయా సినిమాలలో ఉంటాయి. అయినా సరే హర్రర్ సినిమాలనే చూడాలని భీష్మించుకుని కూర్చుంటారు మూవీ లవర్స్. కొన్ని సినిమాలను చూస్తే అప్పుడే అయిపోయిందా.. ఇంకా కొంచెం సేపు సినిమా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది. అలా ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు వచ్చినా కూడా.. ఇప్పుడు చెప్పుకోబోయే హర్రర్ చిత్రం మాత్రం స్పెషల్ . ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు “ది మెయిడ్”. ఇది ఒక థాయ్ సినిమా.. 2020 లో విడుదలైన సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ ఈ సినిమా. ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగే సన్నివేశాలు, తర్వాత ఎం జరుగుతుందా అనే ఆసక్తి.. వెంట వెంటనే ట్విస్ట్ లు ఇలా ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా మూవీ లవర్స్ ను కట్టిపడేస్తుంది. హర్రర్ మూవీస్ అంటే ఇష్టపడే వారికి ఇది బెస్ట్ మూవీ అని చెప్పి తీరాలి. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అసలు ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే.. సాధారణంగా ధనవంతుల ఇళ్లలో పని వాళ్ళు ఉండనే ఉంటారు. ఈ సినిమాలో కూడా అత్యంత ధనవంతులైన ఉమా, నిరాచ్ అనే వారి ఇంట్లో ఓ పని మనిషి ఉంటుంది. ఆమె నిద్రపోయినప్పుడు.. ఓ కోతి బొమ్మ కలలోకి వచ్చి భయపెడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు చూస్తే నిజంగానే ఓ కోతి బొమ్మ ఆమెను భయపెడుతుంది. దీనితో కొన్ని రోజులకు ఆమె ఆ బంగాళలో పని చేయలేనని చెప్పి మానేస్తుంది. అలా ఎంతో మంది వచ్చి ఏవో ఒక కారణాల వలన మానేస్తు ఉంటారు. ఇక ఆ తర్వాత వారి ప్లేస్ లోకి జాయ్ అనే ఓ కొత్త పనిమనిషి వస్తుంది.

జాయ్ కు మొదటి రోజు తన రూమ్ లో అద్దంలో ఓ భయమకరమైన ఆకారం కనిపిస్తుంది. ఆ తర్వాత రోజు కూడా జాయ్ కు రూమ్ లో ఓ మూలాన ఓ దెయ్యం కనిపిస్తుంది. అయితే ఆ దెయ్యం మరెవరో కాదని.. ఆమె కొన్ని సంవత్సరాల క్రితం అక్కడే పని చేసిన అమ్మాయని మిగిలిన వారి ద్వారా తెలుసుకుంటుంది. అసలు పని మనిషిగా వచ్చిన అమ్మాయి.. దెయ్యంగా మారడం ఏంటి ! అసలు అక్కడ ఎం జరిగింది ! దెయ్యంగా మారిన పని మనిషి వచ్చినా వారందరిని ఎందుకు భయపెడుతుంది ! ఇప్పుడు వచ్చిన జాయ్ ఆ దెయ్యానికి హెల్ప్ చేయడానికి వచ్చిందా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చివరి వరకు పూర్తిగా ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకుండా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి