iDreamPost

ATM సెంటర్లలో కొత్త రకం మోసం.. హెచ్చరిస్తున్న పోలీసులు!

New Fraud in ATM Centers: దేశం ఇప్పుడు డిజిటల్ రంగంలో దూసుకెళ్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఎక్కువగా ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. ఒకప్పుడు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి డబ్బులు డ్రా చేసుకునే కాలం పోయింది. ఎక్కడ చూసినా ఏటీఎం లు దర్శనమిస్తున్నాయి. ఇటీవల ఏటీఎం సెంటర్లలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

New Fraud in ATM Centers: దేశం ఇప్పుడు డిజిటల్ రంగంలో దూసుకెళ్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఎక్కువగా ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. ఒకప్పుడు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి డబ్బులు డ్రా చేసుకునే కాలం పోయింది. ఎక్కడ చూసినా ఏటీఎం లు దర్శనమిస్తున్నాయి. ఇటీవల ఏటీఎం సెంటర్లలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

ATM సెంటర్లలో కొత్త రకం మోసం.. హెచ్చరిస్తున్న పోలీసులు!

దేశంలో ఈజీ మనీ కోసం మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్దతులను కనిపెడుతున్నారు. ఎదుటి వారికి మాయ మాటలు చెప్పి అందినంత దోచుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా క్షణాల్లో బురిడీ కొట్టిస్తున్నారు. భారత దేశం ఇప్పుడు డిజిటల్ రంగంలో దూసుకువెళ్తుంది. కోవిడ్ 19 తర్వాత యూపీఏ పేమెంట్స్ (గుగుల్, పేటీఎం, ఫోన్ పే) యాప్ ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయినప్పటికీ ఏటీఎం లో కార్డులు వినియోగం మాత్రం తగ్గడం లేదు. ఇటీవల మోసగాళ్లు కొత్త రకం ఏటీఎం స్కామ్ కి తెరలేపారు. ఏటీఎం నుంచి నగదు డ్రా చేసుకునే వాళ్లను బోల్తా కొట్టించేందుకు కొత్త పద్దతులు వాడుతున్నారని బ్యాంక్ సిబ్బంది, పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా కొత్త రకం మోసాన్ని గుర్తించి.. కస్టమర్లను మోసం చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. వీళ్లు చేస్తున్న మోసం చూసి ఏటీఎం వినియోగదారుల గుండెలు గుభేల్ మంటున్నాయి. వివరాల్లోకి వెళితే..

దేశం వ్యాప్తంగా లక్షల మంది ఏటీఎం సెంటర్లకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకుంటున్న విషయం తెలిసిందే. చాలా మంది మోసగాళ్లు ఏటీఏం సెంటర్ల వద్దకు వెళ్లినవారిని మాయ మాటలు చెప్పి మోసగిస్తున్న విషయం తెలిసిందే. రక రకాల పద్దతులు ఉపయోగించి ఏటీఎం సెంటర్లలలో దోపిడి చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా కొంతమంది కేటుగాళ్ళు సరికొత్త పద్దతిలో జనాలను మోసం చేస్తున్నారు. ఏటీఎం మేషిన్ కార్డు రీడర్ ను ట్యాంపర్ చేసి కస్టమర్లను దారుణంగా మోసం చేస్తున్నారు. వీరి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పపడుతున్న ఓ గ్యాంగ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధానిలోనే కాదు.. ఈ తరహా మోసాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నట్లు గుర్తించారు.

ఈ ముఠా సభ్యులు ఎలా దోచుకుంటారంటే.. సెక్యూర్టీ గార్డులు లేని ఏటీఎం సెంటర్లను ఎంచుకుంటారు. ముందుగా ఏటీఎం సెంటర్లో సీసీ కెమెరాలపై రంగు స్ప్రే చేస్తారు. ఏటీఎం మెషన్ లో కార్డ్ రీడర్ ని తొలగిస్తారు. నగదు డ్రా చేయడానికి వచ్చిన వారు మోషిన్ లో కార్డు పెట్టగానే అందులో ఇరుక్కు పోతుంది. అప్పుడు మెల్లిగా ఎంట్రీ ఇచ్చి మనకు సహాయం చేస్తున్నట్టు గా నటించి  పిన్ నెంబర్ చెప్పమని అడుగుతారు. పిన్ నెంబర్ పదే పదే కొట్టినా కార్డు బయటకు రాకపోవడంతో కస్టమర్ కేర్ కి ఫోన్ చేయాలని సలహా ఇస్తారు. కస్టమర్ కార్డు అక్కడే వది వెళ్లిపోగానే మెల్లిగా కార్డు బయటకు తీసు వేరే ఏటీఎం సెంటర్లో కార్డు పెట్టి పిన్ నెంబర్ ఎంట్రీ చేసి నగదు డ్రా చేసుకుంటున్నారు. ఇలా కొంత కాలంగా తమకు తెలియకుండానే తమ ఖాతాలో నుంచి డబ్బులు మాయం అవుతున్నాయని కస్టమర్లు లబో దిబో అంటున్నారు.

ఇలాంటి మోసగాళ్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఏటీఎం చుట్టు పక్కల జనసంచారం ఉండేలా చూసుకోవాలి. ఏటీఎం సెంటర్ లోకి ఎంట్రీ ఇవ్వగానే సీసీ కెమెరా పనిచేస్తుందా లేదా చూడాలి. రాత్రి పూట జాగ్రత్త తీసుకుంటూ..వెలుతురు ఉన్న ఏటీఎం లోనే నగదు విత్ డ్రా చేసుకోవాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అలర్ట్ గా ఉండాలి. ఏటీఎం ఎంటర్ చేసే సమయంలో చుట్టు వైపులా గమనించాలి. ఏటీఎం లావాదేవీలు జరిపే సమయంలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.. ఎలాంటి వివరాలు ఇవ్వకూడదు. పిన్ నెంబర్, కార్డు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్ లను, బ్యాంక్ స్టేట్ మెంట్ లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవలి అని బ్యాంక్ అధికారులు, పోటీసులు హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి