iDreamPost
android-app
ios-app

5 రోజులుగా ఇంట్లోనే మహిళ మృతదేహం! అసలేం జరిగిందంటే?

5 రోజులుగా ఇంట్లోనే మహిళ మృతదేహం! అసలేం జరిగిందంటే?

నిజామాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో పాటు ఆ మృతదేహం 5 రోజుల పాటు ఇంట్లోనే ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఆ మహిళ ఎలా చనిపోయింది? ఆమెను ఎవరైన హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకుందా? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో లలితా బాయ్ అనే మహిళ నివాసం ఉండేది. ఈమెకు ఓ కూతురు కుమారుడు సంతానం. భర్త గతంలోనే చనిపోవడంతో కూతురి పెళ్లి చేసింది. ఇక కుమారుడు ఉపాధి నిమిత్తం మలేషియాలో ఉంటున్నాడు. దీంతో లలితా బాయ్ స్థానికంగా అక్కడక్కడ పని చేస్తూ ఓ ఇంట్లోనే అద్దెకు ఉండేది. ఇదిలా ఉంటే.. గత గురువారం నుంచి తల్లి లలితా బాయ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కూతురు, కుమారుడు కంగారు పడ్డారు. ఇంతే కాకుండా ఇంటికి తాళ వేసి ఉండడం, పైగా గత రెండు రోజుల నుంచి ఇంట్లో నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో అనేక అనుమానాలు రావడం మొదలయ్యాయి.

దీంతో కూతురు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లలితా బాయ్ ఇంటి తాళం పగలగొట్టి చూడగా.. ఆ మహిళ నగ్నంగా శవమై కనిపించింది. ఈ సీన్ చూసిన పోలీసులు, ఆమె కూతురు, గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కాగా పోలీసులు ఆ మహిళ చనిపోయి ఐదు రోజుల నుంచి మృతదేహం ఇంట్లోనే ఉందని తేల్చారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. లలితా బాయ్ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Giriş