iDreamPost
android-app
ios-app

టాప్‌లోAP.. సీఎం జగన్‌ సర్కార్‌ను ప్రశంసించిన నీతి ఆయోగ్‌!

  • Published Jul 18, 2023 | 1:04 PM Updated Updated Jul 18, 2023 | 2:25 PM
  • Published Jul 18, 2023 | 1:04 PMUpdated Jul 18, 2023 | 2:25 PM
టాప్‌లోAP.. సీఎం జగన్‌ సర్కార్‌ను ప్రశంసించిన నీతి ఆయోగ్‌!

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి.. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఆర్థిక స్వాలంభన సాధించడం కోసం అనేక పథకాలు అమలు చేస్తూనే.. రాష్ట్రం ప్రగతి పథంలో నడిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆకర్షించడానికి గాను అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఇటు సంక్షేమం.. అటు అభివృద్ధి రెండు రకాలుగా రాష్ట్రం ప్రగతి పథంలో నడిచేలా చర్యలు తీసుకుంటూ.. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నీతి ఆయోగ్‌.. జగన్‌ సర్కార్‌పై ప్రశంసలు కురిపించింది. ఆ వివరాలు..

నీతి ఆయోగ్‌ ఏటా ప్రకటించే ఎగుమతుల సన్నద్ధత సూచీ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుని.. టాప్‌లో నిలిచింది. నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ బెరీ సోమవారం విడుదల చేసిన 2022కు సంబంధించిన ఎగుమతుల సన్నద్ధత సూచీ ర్యాంకుల్లో 59.27 పాయింట్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. గతేడాది తొమ్మిదో స్థానంలో ఉన్న మన రాష్ట్రం మరోస్థానం ఎగబాకింది.

ఈ ర్యాంకుల్లో తమిళనాడు.. 80.89 పాయింట్లతో మొదటిస్థానంలో నిలిస్తే, ఆ తరువాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర (78.20), కర్ణాటక (76.36), గుజరాత్‌ (73.22), హరియాణ (63.65), తెలంగాణ (61.36), ఉత్తరప్రదేశ్‌ (61.23) ఉన్నాయి. ఇదిలా ఉండగా 2020లో వెల్లడించిన నివేదికలో ఏపీ 20వ స్థానంలో ఉండగా.. కేవలం రెండేళ్లలో 12 స్థానాలను మెరుగుపర్చుకుని సత్తా చాటింది. అలానే ఎగుమతుల పాలసీలో 99.52 పాయింట్లతో 4వ స్థానం, ఎగుమతుల ఎకోసిస్టమ్‌లో 6వ స్థానం దక్కించుకుంది.

టాప్‌ 100లో ఏపీ నుంచి 8 జిల్లాలు..

2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి 422 బిలియన్‌ డాలర్ల వాణిజ్య ఎగుమతులు జరగ్గా.. వాటిలో ఏపీ వాటా 4.58 శాతం (19 బిలియన్‌ డాలర్లు) ఉందని ఈ నివేదిక పేర్కొంది. ఈ లిస్ట్‌లో గుజరాత్‌ 127 బిలియన్‌ డాలర్ల ఎగుమతులతో మొదటిస్థానంలో ఉంది. దేశం నుంచి అత్యధికంగా ఎగుమతులు జరుగుతున్న టాప్‌ 100 జిల్లాల్లో రాష్ట్రం నుంచి 8 ఉమ్మడి జిల్లాలకు చోటు దక్కడం విశేషం. మరీ ముఖ్యంగా ఈ జాబితాలో విశాఖకు టాప్‌ 10లో తొమ్మిదో స్థానం దక్కగా ఉమ్మడి తూర్పుగోదావరికి 24వ స్థానం దక్కింది. ఎగుమతులు ఇన్‌ఫ్రాలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పనితీరు బాగుందని, అలాగే గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఎగుమతిదారులకు రుణ లభ్యతకూడా భారీగా పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది.

జగన్‌ సర్కార్‌ ప్రోత్సాహంతోనే..

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా నిర్దిష్టమైన పాలసీలను రూపొందించి అమలు చేయడం ద్వారా మాత్రమే ఎగుమతుల సన్నద్ధత సూచీ జాబితాలో ఏపీ ర్యాంకులు మెరుగుపడ్డాయని నీతిఆయోగ్‌ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో అత్యధికంగా ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ జోన్స్, అగ్రిఎక్స్‌పోర్ట్‌ జోన్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు ఎగుమతిదారుల సామర్థ్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వం వర్క్‌షాప్స్, ట్రేడ్‌ ఫెయిర్స్‌ను నిర్వహించిందంటూ కితాబునిచ్చింది. టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ద్వారా నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవడంతో అంతర్జాతీయంగా రాష్ట్రం పోటీపడటానికి దోహదం చేసిందని నీతి ఆయోగ్‌ అభిప్రాయ పడింది.

ఇక ఎగుమతులు పెంచుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, సాధిస్తున్న ఫలితాల ఆధారంగా ఈ సూచీలో ర్యాంకులు నిర్ధారిస్తారు. 2020లో వెల్లడించిన నివేదికలో ఏపీ 20వ స్థానంలో ఉండగా.. ఏడాదిలోనే అనగా 2021లో 9వ ర్యాంకుకు, ఈ ఏడాది మరో ర్యాంకుకు ఎగబాకడం గమనార్హం. దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ కృషి ఎంతో ఉందని నిపుణులు చెబుతున్నారు.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet