iDreamPost

రూ.500 కోట్లు నీతా అంబానీ నెక్లెస్.. కేవలం రూ.178 కే! అట్లుంటది ఇండియన్స్ తో!

  • Published May 31, 2024 | 3:08 PMUpdated May 31, 2024 | 3:19 PM

అనంత్ అంబానీ, రాధికా మార్చెంట్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో.. నీతా అంబానీ ధరించిన భారీ నక్లెస్ అప్పటిలో ఎంతగా వైరల్ అయిందో అందరికి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఆ నక్లెస్ కు ప్రతిరూపంగా మరొక నక్లెస్ అనేది మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. ఇక దీని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకి ఎంతంటే..

అనంత్ అంబానీ, రాధికా మార్చెంట్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో.. నీతా అంబానీ ధరించిన భారీ నక్లెస్ అప్పటిలో ఎంతగా వైరల్ అయిందో అందరికి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఆ నక్లెస్ కు ప్రతిరూపంగా మరొక నక్లెస్ అనేది మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. ఇక దీని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకి ఎంతంటే..

  • Published May 31, 2024 | 3:08 PMUpdated May 31, 2024 | 3:19 PM
రూ.500 కోట్లు నీతా అంబానీ  నెక్లెస్..  కేవలం రూ.178 కే! అట్లుంటది ఇండియన్స్ తో!

దేశంలో అత్యంత సంపన్నులు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురించి తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు. అయితే గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన అంబానీ ఫ్యామీలీ పేరు ఎక్కువగానే వినిపిస్తుందనే చెప్పవచ్చు. అందుకు కారణం ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కూమారుడు అనంత్ అంబానీ, రాధికా మార్చెంట్ ల వెడ్డింగ్ సెలబ్రెషన్స్. కాగా, ఇప్పటికే అనంత్, రాధికాల పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఈఏడాది జూలై 12వ తేదీన వీరి వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే.. వారి నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల దగ్గర నుంచి వెడ్డింగ్ కార్డ్ వరకు ప్రతిది సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉంది.

ఇదిలా ఉంటే.. గతంలో అనంత్ అంబానీ, రాధికా మార్చెంట్ ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో నీతా అంబానీ, ఇషా అంబానీ ధరించిన ఆభరణాలపై అందరీ దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా.. వారు ధరించిన ఆభరణాల ధర ఎంత అని ఆరా తీస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఎందుకంటే.. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో నీతా అంబానీ పచ్చగా పొదిగిన డైమాండ్ నెక్లస్ ను ధరించారు.ఇక దీని ధర రూ. 500 కోట్లు కావడం గమన్హారం. కాగా, ఆ నక్లెస్ కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు ఆ నక్లెస్ కు ప్రతిరూపమైన మరో మోడల్ నక్లెస్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఇక దీని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకి ఎంతంటే..

అనంత్ అంబానీ, రాధికా మార్చెంట్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో.. నీతా అంబానీ ధరించిన భారీ నక్లెస్ అప్పటిలో ఎంతగా వైరల్ అయిందో అందరికి తెలిసిందే. కాగా, ఆ నక్లెస్ ధర చూస్తే.. రూ. 500 కోట్లు విలువైనది కావడం గమన్హారం. అయితే ఇప్పుడు ఆ నక్లెస్ కు ప్రతిరూపంగా మరొక నక్లెస్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చిందంటే.. అది ఏ లక్షల్లో ఉంటుందేమో అని సహజంగా అనుకుంటారు. కానీ, అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. నీతా అంబానీ ధరించిన నక్లెస్ ప్రతిరూపంగా ఓ వక్తి అలాంటి హారాన్ని ఆన్ లైన్ లో రూ. 178కే విక్రయిస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూాడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోల ఆ స్వర్ణకారుడు ఈ నక్లెస్ లను ఎంతో ఉత్సాహంగా విక్రయిస్తున్నాడు. పైగా ‘నీతా అంబానీ జి నెక్లెస్ కేవలం రూ. 178కి అందుబాటులో ఉంది. ఇది కూడా ‘హోల్‌సేల్ మాత్రమే, రిటైల్ కాదు’ అని  పేర్కొన్నాడు.

అయితే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దగ్గర  నుంచి ఇప్పటి వరకు 3.15 మిలియన్లకు పైగా వీక్షించారు. ఇక  భారీ సంఖ్యలో ఈ వీడియో పై స్పందన రావడంతో.. దీనిపై ఒక్కొక్కరు ఒకో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అందులో కాపీ చేయడంలో భారతదేశం అత్యుత్తమమైనది అని ఒకరూ కామెంట్స్ చేయగా, మరొకరు ఇందులో తప్పేముంది, అందరూ ఎవరికి నచ్చిన ఫ్యాషన్‌కి అందరూ అర్హులే అంటూ పేర్కొన్నారు. అలాగే మరొకరు తన భార్య పుట్టినరోజుకు తక్కువ ఖర్చుతో ఖరీదైన బహుమతి ఇస్తాను అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో అతి తక్కువ ధరకే వైరల్ అవుతున్న నీతా అంబానీ నక్లెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by V. V. SONS (@v.v.sons)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి