iDreamPost
android-app
ios-app

కొత్తింట్లోకి అడుగు పెట్టిన డాక్టర్ బాబు.. ఫోటోలు వైరల్!

Nirupam New House Warming Celebrations: టెలివిజన్ రంగంలో ఇప్పటి వరకు ఎన్నో సీరియల్స్ వచ్చాయి. వీటిలో చాలా కొద్ది సీరియల్స్ మాత్రమే బాగా పాపులర్ అయ్యాయి.. అలాంటి సీరియల్స్ లో ఒకటి ‘కార్తీక దీపం’. ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.

Nirupam New House Warming Celebrations: టెలివిజన్ రంగంలో ఇప్పటి వరకు ఎన్నో సీరియల్స్ వచ్చాయి. వీటిలో చాలా కొద్ది సీరియల్స్ మాత్రమే బాగా పాపులర్ అయ్యాయి.. అలాంటి సీరియల్స్ లో ఒకటి ‘కార్తీక దీపం’. ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.

కొత్తింట్లోకి అడుగు పెట్టిన డాక్టర్ బాబు.. ఫోటోలు వైరల్!

వెండితెరపై స్టార్ నటీనటులకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో.. బుల్లితెర నటీనటులకు కూడా అంతే ఫాలోయింగ్ ఉంటుంది. స్మాల్ స్క్రీన్ పై హీరోగా వెలిగిపోతున్న నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచిన నిరుపమ్.. కార్తీక దీపం సీరియల్ తో టీఆర్పీ రేటింగ్స్ కొట్టగొట్టి బుల్లితెర స్టార్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు బుల్లితెరపై చిన్న పాత్రల్లో కనిపించి నిరుపమ్ ‘కార్తీయ దీపం’ సీరియల్ లో డాక్టర్ బాబు గా నటించి విపరీతమైన క్రేజ్ సంపాదించాడు.  తాజాగా నిరుపమ్ పరిటాల కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తెలుగు ప్రేక్షకులకు ‘కార్తీక దీపం’ సీరియల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సంవత్సరాల పాటు కొనసాగుతూ వచ్చిన ఈ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు పేరు మారు మోగింది. డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల అందరికీ సుపరిచితమే. దివంగత నటుడు, రచయిత అయిన ఓంకార్ తనయుడు నిరుపమ్. గతంలో ఓంకార్ పలు చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై ‘ఇది కథ కాదు’, ‘పవిత్ర బంధం’ వంటి సీరియల్స్ లో నటించారు. ఆయన మరణం తర్వాత నిరుపమ్ నటుడిగా మారారు. నిరుపమ్ సతీమణి మంజుల కూడా టీవీ సీరియల్స్ లో నటిస్తూ బాగా ఫేమస్ అయ్యింది. చంద్రముఖి సీరియల్ లో ఇద్దరి స్నేహం మొదలై.. తర్వాత ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పటించి పెళ్లి చేసుకున్నారు.

Nirupam housewarming ceremony

పెళ్లి తర్వాత బుల్లితెర ఇండస్ట్రీకి దూరం అయ్యింది మంజుల. ఈ జంటకు ఒక అబ్బాయి. ఇటీవల కొత్తగా యూట్యూబ్ ఛానెల్ మొదలు పెట్టి తమ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటుంది. శ్రీరామ నవమి సందర్భంగా తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు నిరుపమ్, మంజుల దంపతులు. ఇప్పటి వరకు అద్దె ఇంట్లో ఉంటూ వస్తున్న తాము సొంతగా ఓ ఫ్లాట్ కొనుగోలు చేశామని.. ఇన్నాళ్లకు తమ సొంతింటి కల నెరవేర్చుకున్నామని చెప్పారు.   కొత్తింట్లోకి గృహ ప్రవేశం చేశారు.. ఈ విషయాన్ని నిరుపమ్ తన ఇన్ స్ట్రా గ్రామ్ ద్వారా తెలియజేస్తూ.. కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటోలు చూసిన డాక్టర్ బాబు ఫాలోవర్స్, స్నేహితులు.. నిరుపమ్ కుటుంబానికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Manjula Paritala (@paritala_manjula_official)

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి