iDreamPost

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కీలక ప్రకటన

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి తనను కొనసాగించేలా హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా చార్జి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎప్పటిలాగా తన బాధ్యతలు, విధులను నిష్పక్షపాతంగా, నిజాయతీతో నిర్వర్తిస్తానని తెలిపారు. ఈ మేరకు మీడియాకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రకటన విడుదల చేశారు.

స్థానిక ఎన్నికల ప్రక్రియపై త్వరలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తానని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తెలిపారు. పరిస్థితులు అనుకూలించాక స్థానిక ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తానని తన ప్రకటనలో పేర్కొన్నారు.

‘వ్యక్తులు ముఖ్యం కాదు.. వ్యవస్థ ముఖ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణ స్వీకారం చేసిన వారంతా ఈ సంస్థల సమగ్రతను కాపాడాలి. వాటి విలువలు చిరస్థాయిగా ఉంటాయి’ అని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తన ప్రకటనలో వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి