iDreamPost

మళ్లీ హైకోర్టుకు నిమ్మగడ్డ రమేష్‌కుమర్‌..!

మళ్లీ హైకోర్టుకు నిమ్మగడ్డ రమేష్‌కుమర్‌..!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) వ్యవహారంలో మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మళ్లీ హైకోర్టు తలుపుతట్టనున్నారు. ఎస్‌ఈసీ అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడంలేదని.. ప్రభుత్వం కోర్టు ఉల్లంఘనకు పాల్పడిందనని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం హైకోర్టు సమ్మర్‌ వెకేషన్‌ బెంచ్‌ ముందు పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

ఈ నెల 29వ తేదీన హైకోర్టు తీర్పుననుసరించి నిమ్మగడ్డ తనకు తానే తిరిగి ఎస్‌ఈసీగా బాధ్యతలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన నియామకంపై సర్కూలర్‌ జారీ చేయాలని ఎన్నికల సంఘం కార్యదర్శికి పత్రం పంపారు. ఆయన నియామకాన్ని ప్రకటిస్తూ కార్యదర్శి సర్కూలర్‌ జారీ చేశారు. అయితే హైకోర్టు తీర్పు ఆధారంగా నిమ్మగడ్డ తనకు తానే బాధ్యతలు తీసుకునే అధికారం లేదని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ నిన్న శనివారం మీడియా ముఖంగా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. హైకోర్టు తీర్పు ఆధారంగా అసలు నిమ్మగడ్డ నియామకమే చెల్లదని ట్విస్ట్‌ ఇచ్చారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రింకు వెళుతున్నట్లు ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్‌కుమర్‌ మళ్లీ హైకోర్టును ఆశ్రయించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి