iDreamPost
android-app
ios-app

వైసీపీ రాజ్యసభ సభ్యుడి వాహనానికి ప్రమాదం

వైసీపీ రాజ్యసభ సభ్యుడి వాహనానికి ప్రమాదం

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు మోపీదేవి వెంకట రమణ, తన కుటుంబంతో ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి మోపీదేవి, ఆయన కుటుంబ సభ్యులు తృటిలో తప్పించుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

విశాఖ జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద మోపీదేవి వాహనం ప్రమాదానికి గురైంది. మోపీదేవి వాహన కాన్వాయ్‌లోని ముందు వాహనం సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుక మోపీదేవి ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మోపీదేవి ప్రయాణిస్తున కారు ముందు భాగం దెబ్బతిన్నది. వెనుకనే వస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వాహనంలో ఎంపీ, ఆయన కుటుంబ సభ్యులు విశాఖ వెళ్లారు.