తాత వైఎస్ రాజారెడ్డి మనస్తత్వం జగన్‌కు అబ్బిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడం ద్వారా వైఎస్ రాజశేఖరరెడ్డి మంచోడని చెప్పకనే చెప్పినట్టైంది. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా సీఎంగారూ మీకు తెలియకపోవచ్చు…మీతండ్రి గారు, నేను మంచి స్నేహితులం. ఒకే రూంలో ఉండేవాళ్లమని చంద్రబాబు నవ్వుతూ చెప్పి అందరినీ నవ్వించారు.
చిత్తూరు జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న చంద్రబాబు చంద్రగిరి మండలం ఐతేపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌పై తీవవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ నేరాల్లో దిట్టని, కరుడుగట్టిన నేరస్తుడని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ నేతలు ఆబోతుల్లా తయ్యారయ్యారన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి ఉన్మాద ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను జగన్ తాత రాజారెడ్డి వారి చీనీ చెట్టను నరికి వేయించేవారన్నారు. ఇప్పుడు ఆయన బుద్ధులే జగన్‌కు వచ్చాయన్నారు.
జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు మాటలు వింటుంతే ఎంత అసహనంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కరుడుగట్టిన నేరస్తుడు లాంటి దిగజారుడు విమర్శలు మూడుసార్లు సీఎం పదవిలో కొనసాగిన చేయాల్సినవి కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మనం ఇతరులతో వ్యవహరించే తీరును బట్టే, ఇతరులు కూడా మనతో నడుచుకుంటారు. ఈ చిన్న లాజిక్‌ను చంద్రబాబు ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కావడం లేదు. కావాలనే రెచ్చగొట్టే మాటలు మాట్లాడి, ప్రత్యర్థులతో తనపై అంతకంటే ఎక్కువ తిట్లు తిట్టించుకోడం ద్వారా జనంలో సానుభూతి సృష్టించుకోవాలనే ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏమో అసలే చంద్రబాబు….ఈ పని చేయడనేదేదీ లేదు కదా!